ETV Bharat / bharat

అసోంలో రూ.31 కోట్ల నగదు, బంగారం స్వాధీనం

author img

By

Published : Mar 13, 2021, 8:24 AM IST

Assam assembly polls: EC seizes
అసోంలో రూ.31 కోట్ల నగదు, బంగారం స్వాధీనం

అసోంలో ఎన్నికల నోటిఫికేషన్​ ప్రకటించినప్పటి నుంచి మొత్తం రూ.31.81 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులు పట్టుకున్నామని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నగదు, మద్యం, బంగారం, వెండి ఆభరణాలు, నిషేధిత మత్తుపదార్థాలు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది.

అసోంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు భారీ స్థాయిలో నగదు, మద్యం, బంగారం అక్రమ రవాణాను పట్టుకున్నామని అసోం ఎన్నికల సంఘం తెలిపింది. రూ.8.8 కోట్ల విలువైన నగదు, రూ.7.68 కోట్ల విలువైన మద్యం, రూ.1.46 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.

హెరాయిన్​, గంజాయి, బ్రౌన్​ షుగర్​ వంటి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అసోం ప్రధాన ఎన్నికల అధికారి నితిన్​ ఖాడే తెలిపారు. వీటి మార్కెట్​ విలువ రూ.10.18 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇవేగాకుండా.. విదేశీ సిగరెట్లు, గసగసాలు, నిషేధిత మాత్రలనూ జప్తు చేశామని చెప్పారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 11 మధ్య స్వాధీనం చేసుకున్న ఈ మొత్తం వస్తువుల విలువ రూ.31.81 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.

అసోం పోలీసులు, ఎక్సైజ్​ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ ఇంటిలెజిన్స్​, నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, ఫ్లయింగ్​ స్క్వాడ్స్​తో పాటు వివిధ నిఘా వర్గాలు.. అక్రమ నగదు, మద్యం రవాణాను అడ్డుకోవడంలో నిరంతరం పని చేస్తున్నాయని నితిన్​ ఖాడే తెలిపారు.

ఇదీ చూడండి: 'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.