ETV Bharat / bharat

'MLAలూ.. అమిత్​షా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేయండి.. లేకుంటే మీకు కష్టమే!'

author img

By

Published : May 7, 2023, 10:34 PM IST

Updated : May 7, 2023, 10:59 PM IST

ashok-gehlot-slams-amit-shah-and-sachin-pilot-camp-mlas-in-rajasthan
ashok-gehlot-slams-amit-shah-and-sachin-pilot-camp-mlas-in-rajasthan

రాజస్థాన్​ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​.. సచిన్​ పైలట్​ శిబిరం ఎమ్మెల్యేలపై, అమిత్​ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. హోం మంత్రి, మరో ఇద్దర ఎమ్మెల్యేలతో కలిసి.. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. తన పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు సైతం ఇచ్చారన్నారు.

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​​.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్​ శిబిరం ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 2020లో రాజస్థాన్​ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమిత్​ షా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్​, గజేంద్ర సింగ్ షెకావత్​ కుట్ర పన్నారని గెహ్లోత్​ ఆరోపించారు. అయితే తన ప్రభుత్వాన్ని సంక్షోభం నుంచి కాపాడుకునేందుకు.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే, అదే పార్టీకి మరో ఇద్దరు నాయకులు సాయం చేశారని వెల్లడించారు. దోల్​పుర్​లోని మరేనాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్​, గజేంద్ర సింగ్ షెకావత్​ రాజస్థాన్​లో డబ్బులు పంచారు. వారు తిరిగి ఆ డబ్బును అడగడం లేదు. ఎందుకు ఎమ్మెల్యేల నుంచి డబ్బులు అడగడం లేదు? డబ్బులు తీసుకున్న మా ఎమ్మెల్యేలకు కూడా నేను చెబుతున్నాను. ఒక వేళ మీరు రూ.10 కోట్లు లేదంటే రూ.20 కోట్లు ఎన్ని అయితే తీసుకున్నారో.. వారికి తిరిగి ఇచ్చేయండి. వాటిని మీరు ఖర్చు పెట్టినట్లయితే.. వారికి నేనిస్తాను. ఏఐసీసీ నుంచి తీసుకుని మరి ఇస్తాను. అమిత్​ షా డబ్బును మీ దగ్గర పెట్టుకోవద్దు. ఒకవేళ మీ ఉంచుకుంటే ఆయన హోంమంత్రి కాబట్టి మిమల్ని భయపడతారు. మీపై ఒత్తిడి చేస్తారు" అని గెహ్లోత్​​ అన్నారు. మహారాష్ట్రలోనూ అమిత్ షా ఇలాగే భయపెట్టి శివసేన పార్టీని రెండు ముక్కలుగా విడగొట్టారని ఆయన ఆరోపించారు. పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు.

రాహుల్​ గాంధీ, సోనియా గాంధీ తనను మూడు సార్లు ముఖ్యమంత్రిని చేశారన్నారు గెహ్లోత్​​. అయితే గతాన్ని మరిచిపోయి అందరని తనతోపాటు తీసుకెళ్లడం తన విధి అని వెల్లడించారు. బయటకు వెళ్లిన వారిని కూడా గతాన్ని మరిచిపోవాలని సూచించారు. అందరు ఒకటై పనిచేసుకోవాలిని హితపు పలికారు. దేశం డీఎన్​ఏలోనే కాంగ్రెస్​ ఉందన్నారు గెహ్లాట్​. అదే సమయంలో రాజ్యసభ ఎన్నికలప్పుడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలతో విభేదించి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహాను గెహ్లోత్​ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శోభారాణి సైతం పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. శోభారాణి మాకు ధైర్యంగా మద్దతివ్వడం వల్లే బీజేపీ ఉలిక్కిపడిందన్నారు.

అయితే గత కొంత కాలంగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ ఆరోపిస్తున్నారు. గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ కొద్ది రోజుల క్రితం నిరాహార దీక్షకు సైతం కూర్చున్నారు. ఈ విషయంలో పైలట్‌ నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించింది. అయినా ఆయన దీక్ష చేపట్టారు.

Last Updated :May 7, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.