ETV Bharat / bharat

ఉగ్రవాదుల సైబర్​ వలలో కశ్మీరీ యువత!

author img

By

Published : Jan 4, 2021, 10:16 AM IST

Updated : Jan 4, 2021, 11:47 AM IST

As security forces tighten noose, Pak-based terror groups resort to cyber recruitment in J-K: Officials
ఆన్​లైన్ నియామకాలు చేపడుతున్న ఉగ్రసంస్థలు!

కశ్మీరీ యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు.. పాకిస్థానీ ముష్కర సంస్థలు విభిన్న ఎత్తుగడలు పన్నుతున్నాయి. ఆన్​లైన్​లో దరఖాస్తులు ఆహ్వానించి స్థానికులను ఉగ్రవాద సంస్థల్లో నియమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలు పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నాయి.

స్థానిక కశ్మీరీ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ఉగ్రసంస్థలు కొత్త కుయుక్తులు పన్నుతున్నాయి. ఆన్​లైన్​ ద్వారా ఉగ్రసంస్థల్లో నియామకాలు చేపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల సాయంతో శిక్షణను అందిస్తున్నాయి. జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే దిశగా భారత సైన్యం గట్టి చర్యలు చేపట్టిన తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు.

నకిలీ వీడియోలు సృష్టించి..

అంతకుముందు ఉగ్రవాద సానుభూతి పరులు.. కశ్మీరీలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకునే వారు. అయితే.. ప్రస్తుతం అలాంటి సానుభూతిపరులను సైన్యం అణచివేసింది. ఈ నేపథ్యంలో... భద్రతా బలగాలు దురాగతానికి పాల్పడ్డాయంటూ నకిలీ వీడియోలను సృష్టించి స్థానికుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. తద్వారా యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. 2020లో 40 మందికి పైగా టెర్రరిస్టు సానుభూతిపరులను సైన్యం అరెస్టు చేసింది.

యూట్యూబ్​లో ఉగ్రశిక్షణ..

గత నెలలో తవార్ వాఘే, అమీర్ అహ్మద్ మీర్ అనే ఇద్దరు ముష్కరులు.. 34 రాష్ట్రీయ రైఫిల్స్​ ఆర్మీ ముందు లొంగిపోయారు. ఆన్​లైన్​లో తాము ముష్కరులతో ఎలా చేతులు కలిపామో కీలక విషయాలను వెల్లడించారు.

పాకిస్థాన్​కు చెందిన ఓ ఫేస్​బుక్​ ఖాతాదారుడితో ఆ ఇద్దరు ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత మహ్మాద్​ అబ్బాస్​ షేక్​ అనే ఓ రిక్రూటర్​ సాయంతో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ది రెసెస్టెన్స్​ ఫ్రంట్​ అనే ఉగ్రసంస్థలో చేరారు. యుట్యూబ్​ లింకుల ఆధారంగా వారిద్దరికీ శిక్షణ అందింది. దక్షిణ కశ్మీర్​లోని షోపియాన్​లో ఒక్కసారి మాత్రమే.. వారు ముష్కరులను ప్రత్యక్షంగా కలిశారు.

ఎక్కువగా దక్షిణ కశ్మీర్​లోనే..

స్లీపర్​సెల్స్​ గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే ఈ తరహా ఆన్​లైన్​ ఉగ్రశిక్షణను ముష్కర సంస్థలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల సాయంతో ఇలాంటివి ఇప్పటివరకు 40 నియామకాలు జరిగాయని వెల్లడించారు. ఇవి ఎక్కువగా.. దక్షిణ కశ్మీర్​లోనే జరిగాయని పేర్కొన్నారు. ఉగ్రసంస్థల్లో చేరిక కోసం... సరిహద్దు నుంచి అందే ఉత్తర్వుల కోసం మరింత మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు.

ఆయుధాల కొరతే కారణమా..!

కశ్మీర్​లోని ఉగ్రసంస్థలు ఆయుధాల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందుకే పాకిస్థాన్​కు చెందిన ముష్కర సంస్థలు, ఎక్కువ ఆయుధాలు, తక్కువ మంది ఉగ్రవాదులను కశ్మీర్​కు పంపుతున్నాయి. గత నెలలో జమ్మునగర సరిహద్దులో జరిగిన ఎన్​కౌంటర్​ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదుల నుంచి 11 రైఫిళ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి లభ్యమైంది.

భయపెట్టి.. బలిచేస్తున్నారు!

గత నెల చివర్లో ఉత్తర కశ్మీర్​లో జరిగిన 22 ఏళ్ల స్థానిక టెర్రరిస్టు అమిర్​ సిరాజ్​ ఎన్​కౌంటర్​.. ఆన్​లైన్​ ఉగ్ర నియామకాలకు మరో ఉదాహారణ. ఖవాజా గిల్గత్​కు చెందిన సిరాజ్​ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థి. అడిపోరాలో తన మామతో కలిసి నివసించే.. సిరాజ్​కు ఫుట్​బాల్​ ఆటపై ఆసక్తి ఉండేది. గతేడాది జూన్ 24న అతడు​.. ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత సిరాజ్​.. జైష్​-ఏ-మహ్మద్​ ఉగ్రసంస్థలో కలిసిపోయాడన్న వార్త తెలిసింది.

సామాజిక మాధ్యమాల ప్రభావంతోనే సిరాజ్ ముష్కరులతో కలిసిపోయాడని అధికారులు తెలిపారు. అతడు​ లొంగిపోవాలని అనుకున్నప్పటికీ.. తన కుటుంబానికి ప్రాణహాని తలపెడతామని ఉగ్రవాదులు హెచ్చరించారని చెప్పారు.

ఇదీ చూడండి:ఉగ్రవాదం వైపు కశ్మీరీ యువత- ఆపేదెలా?

Last Updated :Jan 4, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.