ETV Bharat / bharat

'నిద్ర సమస్యల కారణంగానే గంజాయి తీసుకున్నా'

author img

By

Published : May 30, 2022, 8:08 AM IST

aryan khan news
aryan khan news

aryan khan news: బాలీవుడ్​ నటుడు షారుఖ్​ఖాన్​ కుమారుడు ఆర్యన్​ ఖాన్​ డ్రగ్స్​ కేసు ఛార్జిషీట్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు ఆర్యన్​ తెలిపాడని ఎన్​సీబీ తెలిపింది.

aryan khan news: క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. అమెరికాలో తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అభియోగపత్రంలో ఈ విషయాన్ని పొందుపర్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన 20 మందిలో 14 మందిపై ఎన్‌సీబీ శుక్రవారం ముంబయి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సరైన ఆధారాలు లేని కారణంగా ఆర్యన్‌ సహా ఆరుగురి పేర్లను మినహాయించింది. ఈ క్రమంలో ఛార్జిషీట్‌లో అనేక ఆస్తకికర విషయాలు వెల్లడయ్యాయి.

2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్‌ ఎన్‌సీబీ ముందు అంగీకరించినట్లు అభియోగపత్రం వెల్లడిస్తోంది. ఆ సమయంలో.. కొన్ని నిద్ర సమస్యలు ఉన్నాయని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని కొన్ని ఇంటర్నెట్ కథనాల్లో చదివినట్లు వాంగ్మూలమిచ్చాడు. సరదా కోసం మారిజునానూ తీసుకున్నట్లు ఒప్పుకొన్నాడని ఛార్జిషీట్‌లో నమోదైంది. తన ఫోన్‌లో దొరికిన వాట్సాప్ డ్రగ్ చాట్ తానే చేసినట్లు అంగీకరించాడని ఎన్‌సీబీ తెలిపింది. ‘దోఖా’ అనే కోడ్‌వర్డ్‌తో గంజాయి కొనుగోలు కోసం ఈ కేసులో మరో నిందితుడైన ఆచిత్‌తో వాట్సాప్ చాట్‌ చేశానని ఒప్పుకొన్నట్లు ఛార్జిషీట్‌లో తేలింది. మరోవైపు.. ఆర్యన్ ఫోన్‌ను అధికారికంగా స్వాధీనం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్‌ వివరాలేవీ అతనికి ప్రస్తుత కేసుతో సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్‌సీబీ వెల్లడించింది.

గంజాయి విషయంలో నటి అనన్య పాండేతోనూ చాట్ చేసినట్లు ఆర్యన్ ఖాన్ అంగీకరించాడని ఛార్జిషీట్‌లో వెల్లడైంది. ఈ ఆరోపణల ఆధారంగా.. ఎన్‌సీబీ ఆమెను విచారించి, స్వచ్ఛంద స్టేట్‌మెంట్‌లనూ రికార్డు చేసింది. ఈ చాట్‌ తానే చేసినట్లు ఆమె అంగీకరించిందని.. అయితే ఏదో తమాషాగా, జోక్‌గా భావించి చేశానని వెల్లడించినట్లు ఎన్‌సీబీ తెలిపింది. క్రూజ్‌ నౌక పార్టీ సమయంలో ఆర్యన్‌ డ్రగ్స్‌ కోసం ఓ కొత్త నటితో చాటింగ్‌ చేసినట్లు ఎన్‌సీబీ అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. తన విషయంలో ఆర్యన్ అబద్ధం చెబుతున్నాడని, అతను ఇలా ఎందుకు చెప్పాడో తెలియదని అనన్య వాపోయినట్లు అభియోగపత్రంలో నమోదైంది. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో సోదాలు చేపట్టగా.. ఎటువంటి నిషిద్ధ పదార్థాలు లభ్యం కాలేదని, కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను స్వాధీనం చేసుకుని, సీజ్‌ చేసినట్లు ఎన్‌సీబీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో ఆర్యన్​ఖాన్​కు పరిహారం చెల్లించాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.