ETV Bharat / bharat

110 గంటల్లో 75కి.మీ రోడ్డు నిర్మాణం.. గిన్నిస్​ రికార్డే లక్ష్యం!

author img

By

Published : Jun 3, 2022, 7:50 PM IST

fastest road construction: అత్యంత వేగంగా రహదారి నిర్మాణం చేపట్టి ఖతార్​ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాయనుంది మహారాష్ట్రలోని అమరావతి-అకోలా రహదారి. 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని కేవలం 110 గంటల్లోనే పూర్తి చేయనున్నారు. అందుకోసం 800 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు.

fastest road construction
110 గంటల్లో 75కిమీ రోడ్డు నిర్మాణం

fastest road construction: ప్రపంచ రికార్డ్​ సృష్టించటమే లక్ష్యంగా మహారాష్ట్రలోని అమరావతి-అకోలా జాతీయ రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. 75 కిలోమీటర్ల మేర రహదారిని కేవలం 110 గంటల్లో నిర్మించి గిన్నిస్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ పనులు శుక్రవారం(జూన్​ 3) ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. జూన్​ 7న సాయంత్రంలోపు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న సమయానికి పూర్తయితే.. గిన్నిస్​ రికార్డులో చోటు లభించనుంది.

fastest road construction
రోడ్డు నిర్మాణం

గత 10 ఏళ్లుగా అమరావతి- అకోలా రహదారి గుంతలమయంగా మారి అధ్వాన స్థితిలో ఉండేది. గతంలో ఈ రోడ్డు నిర్మాణ పనులను మూడు సంస్థలకు అప్పగించారు. కానీ, పనులు చేయటంలో జాప్యం చేశారు కాంట్రాక్టర్లు. దీంతో ప్రజలు అమరావతి నుంచి అకోలా చేరుకునేందుకు దర్యాపుర్​ రహదారిని వినియోగించేవారు.

అమరావతి-అకోలా దారిలో ప్రయాణించటం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణ రహదారిగా పేరు గాంచిన ఈ దారి ఇప్పుడు రికార్డ్​ సృష్టించబోతోంది. ఈ రోడ్డు పనులను నాలుగు దశల్లో పూర్తి చేయనున్నారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యంపై గతంలోనే కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ రహదారి పనులను రాజ్​పథ్​ ఇన్​ఫ్రాకాన్​ సంస్థకు అప్పగించింది జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ.

fastest road construction
రోడ్డు నిర్మాణ పనులు

రంగంలోకి 800 మంది: ఒక్కో భాగాన్ని నిర్మించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్​ మేనేజర్​, హైవే ఇంజినీర్​, క్వాలిటీ ఇంజినీర్​, సర్వేయర్​, సెఫ్టీ ఇంజినీర్​ సహా మొత్తం 800 మంది ఉద్యోగాలు ఇందులో భాగమయ్యారు. మనా క్యాంప్​లో వార్​ రూమ్​ను ఏర్పాటు చేశారు. అందులో 4 హాట్​ మిక్సర్లు, 4 బిల్డర్స్​, 1 మొబైల్​ ఫీడర్​, రోలర్​ వంటివి అందుబాటులో ఉంచారు. మరోవైపు.. అత్యాధునిక సాంకేతికతతో రోడ్డు నిర్మించి రికార్డు సృష్టించబోతున్నట్లు చెప్పారు రాజ్​పథ్​ ఇన్​ఫ్రాకాన్​ ప్రైవేట్ లిమిటెడ్​ సంస్థ ఎండీ జగదీశ్​ కదమ్​.

గత రికార్డు: గతంలో ఖతార్​లో అత్యంత వేగంగా 22 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డ్​ సృష్టించారు. ఇప్పుడు ఖతార్​ రికార్డును అమరావతి-అకోలా రహదారి తిరగరాయనుంది. ఇప్పటికే గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​ భారత ప్రతినిధులు అమరావతికి చేరుకున్నారు. విదేశీ ప్రతినిధులు జూన్​ 7న సాయంత్రం 7 గంటలకు రానున్నారు.

ఇదీ చూడండి: ఆమె కడుపులో రూ.3కోట్లు విలువైన డ్రగ్స్.. వారం కష్టపడితే...

బిందు 'వింత పెళ్లి'కి ఆదిలోనే ఆటంకం.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.