అమిత్​ షా టూర్​లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్​చల్.. చివరకు...

author img

By

Published : Sep 8, 2022, 11:11 AM IST

Updated : Sep 8, 2022, 11:48 AM IST

Man-for-impersonating-mha-staffer-during-shah-mumbai-visit

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముంబయి పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ ఎంపీ పీఏ అని తెలిసింది.

Amit Shah Security Breach : ఆంధ్రప్రదేశ్​లోని ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శినంటూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పక్కనే అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని గిర్గావ్​ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి పంపింది. సెప్టంబర్​ 5న జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది: అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ముంబయిలో పర్యటించారు. నగరంలోని ప్రముఖ గణేశ్ మండపాల్ని సందర్శించారు. ఆ తర్వాత పురపాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భాజపా కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో భద్రతా లోపం తలెత్తినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

ఓ వ్యక్తి అమిత్​ షాకు అతి దగ్గరగా, చాలా సేపు తిరుగుతూ ఉన్నట్లు అధికారులు గమనించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. నిండితుడు మహారాష్ట్రలోని ధూలెకు చెందిన హేమంత్​ పవార్​గా గుర్తించారు. మలబార్​ హిల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్​కు తరలించారు.

హోం మంత్రిత్వ శాఖ గుర్తింపు కార్డు ధరించినందు వల్ల అతనిపై అనుమానం రాలేదని అధికారులు అన్నారు. అమిత్​ షా భద్రతా సిబ్బంది జాబితాలో అసలు నిండితుడి పేరు లేదని, అయితే అతడు గంటల తరబడి ఆ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిలా తిరుగాడినట్లు సమాచారం. ఈ వ్యక్తి ఇదివరకే మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ శిందే, ఉపముఖ్యమంత్రి​ దేవేంద్ర ఫడణవీస్​ ఇంటి చుట్టూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిని అని చెప్పుకుని తిరిగాడని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: భారత్​లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- జపాన్​లో లక్షపైనే!

'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

Last Updated :Sep 8, 2022, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.