ETV Bharat / bharat

కేంద్రమంత్రిని బ్లాక్​మెయిల్ చేసిన గ్యాంగ్ అరెస్ట్​

author img

By

Published : Dec 24, 2021, 5:53 PM IST

Ajay mishra blackmailing: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బ్లాక్​ మెయిల్ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి వాళ్లంతా కొద్ది రోజులుగా కాల్ చేసి తనను బెదిరిస్తున్నారని మంత్రి ఫిర్యాదు చేశారు.

ajay mishra teni, అజయ్ మిశ్రా
కేంద్రమంత్రిని బ్లాక్​మెయిల్ చేసిన గ్యాంగ్ అరెస్ట్​

Ajay mishra blackmailing: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను బెదిరించిన ఐదుగురు సభ్యుల ముఠాను దిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కస్టడీకి తరలించారు.

లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి కొందరు తనకు ఫోన్​ చేసి బెదిరిస్తున్నారని కొద్ది రోజుల క్రితం అజయ్ మిశ్రా దిల్లీ పోలీస్ కమిషనర్​ రాకేశ్ అస్థానాకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు రోజు ఫోన్ చేసి బ్లాక్​మెయిల్​కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఫిర్యాదు మేరకు నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదైంది. ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించి మంత్రిని బ్లాక్​మెయిల్​ చేసిన ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురు నోయిడాకు చెందినవారు కాగా.. ఒకరు దిల్లీ వాసి.

Lakhimpur Violence: ఆశిష్​ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఇదీ చదవండి: దొంగలతో చేతులు కలిపిన పోలీస్​- 53 బైక్​లు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.