ETV Bharat / bharat

పన్నీర్​సెల్వంకు 'పళని' మరో షాక్​.. కుమారులు సహా వారంతా పార్టీ నుంచి ఔట్​

author img

By

Published : Jul 14, 2022, 6:57 PM IST

AIADMK interim chief Palaniswami expels O Panneerselvam's sons, 16 other supporters
AIADMK interim chief Palaniswami expels O Panneerselvam's sons, 16 other supporters

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం.. కీలక మలుపులు తిరుగుతోంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి.. పన్నీర్​సెల్వం కుమారులు సహా ఆయన మద్దతుదారులను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన అన్నాడీఎంకే.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్నీర్​సెల్వం కుమారులు, మరో 16 మంది ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి.

పన్నీర్​ సెల్వం కుమారుల్లో ఒకరు రవీంద్రనాథ్​ తేని నియోజకవర్గం నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమారుడు జయప్రదీప్​, మాజీ మంత్రి ఎన్​ నటరాజన్​పైనా పార్టీ వేటు వేసింది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. వీరంతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని, అన్నాడీఎంకేకు చెడ్డ పేరు తెచ్చారని ఓ ప్రకటనలో తెలిపారు పళనిస్వామి.

కొద్దిరోజుల క్రితం.. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ద్వంద్వ నాయకత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కో ఆర్డినేటర్‌, జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ పదవులను తొలగిస్తూ తీర్మారాన్ని ఆమోదించారు. దీంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకుంది పార్టీ. వెంటనే పన్నీర్​ సెల్వంను పార్టీ నుంచి తొలగించింది.

ఇవీ చూడండి: 'మహా' గుడ్​ న్యూస్​.. లీటర్​ పెట్రోల్​పై రూ.5, డీజిల్​పై రూ.3 తగ్గింపు

పన్నీర్​సెల్వంకు ఎదురుదెబ్బ.. ఇక ఆ పదవి మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.