ETV Bharat / bharat

బాయ్​ఫ్రెండ్​తో గొడవ, మద్యం సేవించి చేయి కోసుకున్న యువతి

author img

By

Published : Aug 19, 2022, 1:46 PM IST

బాయ్​ఫ్రెండ్​తో గొడవ పెట్టుకుని ఓ యువతి రోడ్డుపై వీరంగం సృష్టించింది. అనంతరం ​చేయి కోసుకుంది. గాయపడిన అమ్మాయిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని నైనీతాల్​లో జరిగింది.

gilr creates ruckus in nainital
After spat with beau, drunken girl slits her wrist, creates ruckus in Nainital

Drunken Girl News: బాయ్​ఫ్రెండ్​తో గొడవ పెట్టుకుని రోడ్డుపై ఓ అమ్మాయి హల్​చల్​ చేసింది. చేయి కోసుకుని భీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నైనీతాల్​లో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ నగరానికి చెందిన అమ్మాయి తన స్నేహితురాలితో ఉత్తరాఖండ్​లోని నైనితాల్​ను సందర్శించడానికి వెళ్లింది. ఇద్దరూ తల్లీతాల్​ ప్రాంతంలోని ఓ హోటల్​లో ఉన్నారు. గురువారం రాత్రి ఆ అమ్మాయి తన బాయ్​ఫ్రెండ్​తో ఫోన్లో మాట్లాడింది. మాటలు కాస్తా వాగ్వాదానికి దారితీశాయి. అనంతరం మద్యం సేవించింది యువతి.. హోటల్​ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై హల్​చల్​ చేసింది. తర్వాత తన చేయి కోసుకుంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు బీడీ పాండే ఆస్పత్రికి తరలించారు. మణికట్టుకు గాయమైందని.. ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్​ చేశామని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్​ చెప్పారు. ఘటనకు సంబంధించి ఆ అమ్మాయిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: బిర్యానీ బిల్లు విషయంలో గొడవ, కత్తితో దారుణంగా పొడిచి

ప్రియుడితో భార్య పరార్​, ముగ్గురు పిల్లలకు విషం తాగించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.