ETV Bharat / bharat

'నా రక్తం మరుగుతోంది'.. ఆదిపురుష్​పై ఆగని ఆగ్రహజ్వాల! ఇష్టముంటేనే చూడాలన్న కేంద్రమంత్రి

author img

By

Published : Jun 19, 2023, 9:46 PM IST

Updated : Jun 19, 2023, 10:26 PM IST

Adipurush Controversy : ఆదిపురుష్ సినిమాపై వివాదం కొనసాగుతోంది. సినిమాపై నిషేదం విధించాలనే డిమాండ్​లు వినిపిస్తున్నాయి. సోమవారం ఉత్తర్​ప్రదేశ్​ వ్యాప్తంగా సినిమాకు వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. కొన్ని సంఘాలు పోలీస్​ స్టేషన్​లో​ ఫిర్యాదులు అందించాయి.

adipurush-controversy-adipurush-protest-in-uttarpradesh
ఆదిపురుష వివాదం

Adipurush Controversy : ఆదిపురుష్​ సినిమాపై ఉత్తర్​ప్రదేశ్​ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు జరుగుతన్నాయి. వారణాసికి చెందిన కొన్ని సంఘాల నాయకులు.. సినిమా నిర్మాతలపై, నటినటులపై రాజధాని లఖ్​నవూలోని వివిధ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మరికొంత మంది మథురలోని ఓ ధియేటర్ ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. సినిమా చిత్రీకరణపై అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. సినిమాలోని కొన్ని డైలాగ్స్ వింటుంటే తన రక్తం మరుగుతోందన్నారు. సినిమాపై నిషేదం విధించాలని ఆయన డిమాండ్​ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

సినిమాలోని రాముడు, సీత, హనుమంతుడి పాత్రల డైలాగ్​లు.. రామాయణ సంస్కృతిని నాశనం చేసేవిగా ఉన్నాయని మరో పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చిత్రీకరణలో విదేశీయుల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు.. సంబంధిత సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకోవాలని ఆయన సూచించారు. వారణాసిలో సినిమాకు వ్యతిరేకంగా పలు సంఘాల నాయకులు ర్యాలీలు సైతం తీశారు. సినిమాను చూడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా సినిమా ప్రదర్శనకు అనుమతినిచ్చిన సెన్సార్​ బోర్డ్​పై సమాజ్​వాది పార్టీ అధినేత అఖిలేష్​ యాదవ్​ మండిపడ్డారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ.. రాజకీయ దురుద్దేశంతో తీసే సినిమాలకు 'పొలిటికల్​ క్యారెక్టర్​ సర్టిఫికేట్​' కూడా తనిఖీ చేయాలన్నారు. సెన్సార్​ బోర్డ్​ ధృతరాష్ట్రుడిగా మారిందా? ఆయన ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి స్పందన..
Adipurush Anurag Thakur : ఆదిపురుష్‌ సినిమాలోని మాటల చుట్టూ నెలకొన్న వివాదంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీయడానికి అనుమతించేది లేదన్నారు. సినిమాలోని పలు ఇబ్బందికరమైన డైలాగ్​లను చిత్ర యూనిట్​ మార్చనున్నట్లు ప్రకటించిందన్నారు. దానిని తానూ పర్యవేక్షిస్తానని వెల్లడించారు.

ఇష్టమైతేనే చూడండి: కేంద్ర మంత్రి
ఆదిపురుష్ సినిమా ఈ వివాదం చెలరేతున్న వేళ కేంద్ర సహాయ మంత్రి ఎస్​పీ సింగ్​ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికైతే సినిమా నచ్చలేదో వారు చిత్రాన్ని చూడొదన్నారు. ఓ ఎజెండాలో భాగంగానే ఈ సినిమా తీసారన్న.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై బఘేల్ ఈ విధంగా స్పందించారు.

ఓంరౌత్‌ చిత్రీకరించిన ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్‌, కృతిసనన్‌ జంటగా నటించారు. విడుదలైన రోజు నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సినిమాలోని కొన్ని డైలాగ్​లు, సన్నివేశాలు రామాయణానికి భిన్నంగా ఉన్నాయంటూ పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్‌ను తప్పుబడుతూ సామాజిక మధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jun 19, 2023, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.