ETV Bharat / bharat

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

author img

By

Published : Aug 17, 2022, 5:05 PM IST

Updated : Aug 17, 2022, 6:34 PM IST

adani security category
గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్​ అధినేత గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అయ్యే ఖర్చును ఆయనే భరించాల్సి ఉంటుంది.

Adani security category : దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్​ ఛైర్మన్ గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది కేంద్రప్రభుత్వం. సీఆర్​పీఎఫ్​ కమాండోలు ఆయనకు ఇకపై రక్షణగా ఉండనున్నారు. అదానీకి ముప్పు ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అదానీ భద్రతను చూసుకోవాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్​(సీఆర్​పీఎఫ్​)ను కేంద్ర హోంశాఖ కోరగా.. కమాండోలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. అయితే.. జెడ్ కేటగిరీ భద్రతకు అయ్యే ఖర్చంతా అదానీనే భరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఆయనకు పటిష్ఠ భద్రత కల్పించేందుకు నెలకు రూ.15-20లక్షలు చెల్లించాలి.
మరో దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్​ అంబానీకి 2013 నుంచి జెడ్ ప్లస్​ భద్రత కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత కొన్నేళ్ల నుంచి ఆయన భార్య నీతా అంబానీకి కాస్త తక్కువ స్థాయి భద్రత కల్పిస్తోంది.

డోభాల్​ ఇంటి వద్ద భద్రతా వైఫల్యం.. ముగ్గురిపై వేటు
మరోవైపు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇంటి వద్ద భద్రతా వైఫల్యానికి కారకులంటూ ముగ్గురు కమాండోలను డిస్మిస్ చేసింది సీఐఎస్​ఎఫ్​.
డోభాల్​కు జెడ్ ప్లస్ భద్రత ఉంది. సీఐఎస్​ఎఫ్​లోని ఎస్​ఎస్​జీ విభాగం ఆయన రక్షణ కల్పిస్తోంది. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 16న దిల్లీలోని డోభాల్​ ఇంట్లోకి కారుతో చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకుని దిల్లీ పోలీసులకు అప్పగించారు.

ఈ భద్రతా వైఫల్యంపై సీఐఎస్​ఎఫ్​ అంతర్గత విచారణ జరిపింది. ఆ రోజులు డోభాల్ ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండోలను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. మరో ఇద్దరు ఉన్నతాధికారుల్ని బదిలీ చేసింది.

Last Updated :Aug 17, 2022, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.