ETV Bharat / bharat

అరుణాచల్​లో కూలిన ఆర్మీ హెలికాప్టర్​- నలుగురు మృతి

author img

By

Published : Oct 21, 2022, 12:06 PM IST

Updated : Oct 21, 2022, 6:00 PM IST

a military chopper crashed in arunachal pradesh
a military chopper crashed in arunachal pradesh

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆర్మీ హెలికాప్టర్​ కుప్పకూలింది. సియాంగ్‌ జిల్లాలోని సింగింగ్‌ గ్రామానికి 25 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి రోడ్డు మార్గం కూడా లేదని సమాచారం.

Military Chopper Crash: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆర్మీ హెలికాప్టర్​ కుప్పకూలగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సియాంగ్‌ జిల్లాలోని సింగింగ్‌ గ్రామానికి 25 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి రోడ్డు మార్గం కూడా లేదని సమాచారం. హుటాహుటిన రెస్యూ సిబ్బందిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి అధికారులు తరలించారు. అతికష్టం మీద 4 మృతదేహాలు వెలికి తీశారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం.. తవాంగ్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి: సెప్టిక్​ ట్యాంక్​ క్లీన్​ చేస్తుండగా విషాదం.. ఊపిరి ఆడక ముగ్గురు కార్మికులు మృతి!

ప్లేట్​లెట్లకు బదులు ఫ్రూట్​ జ్యూస్​ ఎక్కించిన వైద్యులు.. డెంగీ రోగి మృతి

Last Updated :Oct 21, 2022, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.