ETV Bharat / bharat

స్కూటీ ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్​ కోసం రూ.15లక్షలు ఖర్చు

author img

By

Published : Apr 20, 2022, 12:51 PM IST

honda-activa-scooty-vip-number-in-chandigarh
స్కూటీ ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్​ నంబర్​ కోసం రూ.15లక్షలు ఖర్చు

Fancy number plate: రూ.71వేలు ఖరీదు చేసే హోండా యాక్టివా నంబర్​ ప్లేట్​ కోసం రూ.15.44లక్షలు ఖర్చు చేశాడు ఓ వ్యక్తి. వేలంపాటలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ పెద్దమొత్తం వెచ్చించి ఫ్యాన్సీ నంబర్​ దక్కించుకున్నాడు.

Honda Activa VIP number: ఫ్యాన్సీ నంబర్​ కోసం కొంతమంది ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ఖరీదైన కారు యజమానులు ఒక్కోసారి రూ.లక్షలు వెచ్చించి తమకు ఇష్టమైన రిజిస్ట్రేషన్ నంబర్ దక్కించుకుంటారు. అయితే హరియాణా చండీగఢ్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రూ.71వేలు ఖరీదు చేసే స్కూటీకి.. ఫ్యాన్సీ నంబర్​ ప్లేట్​ కోసం ఏకంగా రూ.15.44 లక్షలు ఖర్చు చేశాడు. వేలంపాటలో తీవ్రంగా పోటీ ఉన్నా.. తగ్గేదే లే.. అన్నట్లుగా అనుకున్న నంబర్​ సాధించాడు​.

Haryana fancy number plate: ఫ్యాన్సీ నంబర్ దక్కించుకున్న ఈ 42 ఏళ్ల వ్యక్తి పేరు బ్రజ్​మోహన్​. చండీగఢ్​లోని సెక్టార్​-23లో నివాసముంటున్నారు. అడ్వర్​టైజింగ్ వ్యాపారం నిర్వహిస్తారు. ఇటీవలే హోండా యాక్టివా కొనుగోలు చేశారు. దానికి ఫ్యాన్సీ నంబర్​ ప్లేట్ కోసం చండీగఢ్​ రిజిస్ట్రేషన్​ అండ్ లెసైన్సింగ్ అథారిటీ నిర్వహించిన వేలంపాటలో పాల్గొన్నారు. చివరకు రూ.15.44లక్షలతో 'CH01-CJ-0001' వీఐపీ నంబర్​ను దక్కించుకున్నారు. ఈ అరుదైన సంఖ్య కోసం ఇతరులు కూడా తీవ్రంగా పోటీపడ్డారు. కానీ బ్రజ్​మోహన్​ అంతిమ విజేతగా నిలిచారు. ఈ వేలంపాటను ఏప్రిల్​ 14-16 మధ్య నిర్వహించారు. మొత్తం 378 ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా.. రూ.1.5కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

అయితే ఈ ఫ్యాన్సీ నంబర్​ను కేవలం స్కూటీ కోసమే తీసుకోలేదని చెప్పారు బ్రజ్​మోహన్​. భవిష్యత్తులో ఇదే నంబర్​ను కారు నంబర్​ ప్లేట్​గా ఉపయోగిస్తానని తెలిపారు. అందుకే అంత మొత్తం వెచ్చించినట్లు స్పష్టం చేశారు. మొదటగా మాత్రం హోండా యాక్టివాపైనే ఈ నంబర్​ కన్పిస్తుందని పేర్కొన్నారు. 'CH01-CJ' కొత్త సిరీస్​లో వచ్చే నంబర్​ ప్లేట్ల కోసం నిర్వహించిన వేలంపాటలో అత్యధిక ధర పలికింది బ్రజ్​మోహన్ దక్కించుకున్న​ నంబరే అని తెలుస్తోంది.

ఇదీ చదవండి: జహంగీర్​పురిలో బుల్​డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీం స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.