ETV Bharat / bharat

బాయ్​ఫ్రెండ్స్​తో కలిసి కన్నతల్లి హత్య.. కారణం తెలిస్తే షాక్!

author img

By

Published : Mar 28, 2022, 8:25 PM IST

Girl killed her Mother: కన్నతల్లిని కూతురే కర్కశంగా హత్య చేసింది. తన బాయ్​ఫ్రెండ్ సహకారంతో తల్లిని చంపేసింది. నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించింది. అయితే, హత్యకు గల కారణాన్ని విని పోలీసులు షాక్ అయ్యారు.

Girl killed her Mother
Girl killed her Mother

Girl killed her Mother: బాయ్​ఫ్రెండ్​తో కలిసి కన్నతల్లిని హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. నిద్రిస్తుండగానే తల్లిపై దాడి చేసి చంపేసింది యువతి. మునియలక్ష్మి అనే మహిళ.. తన భర్తకు దూరంగా ఉంటోంది. నలుగురు పిల్లలతో కలిసి ట్యూటికోరన్​లో నివసిస్తోంది. స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తాత్కాలిక క్లీనర్​గా పనిచేస్తోంది.

Girl killed Mother boyfriends help: మహిళ పెద్ద కూతురు(17) పాలిటెక్నిక్ మధ్యలోనే ఆపేసింది. స్థానికంగా చాలా మంది యువకులతో యువతి సన్నిహితంగా ఉండేదని సమాచారం. బాయ్​ఫ్రెండ్స్​తో కలిసి యువతి చేసే పనులు ఇష్టం లేక.. ఆమెపై తల్లి కఠినంగా వ్యవహరించింది. ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. దీంతో తల్లిపై ద్వేషం పెంచుకుంది యువతి.

అదే కోపంలో.. ఓ బాయ్​ఫ్రెండ్​తో కలిసి సోమవారం తల్లిపై దాడి చేసింది. తల్లి నిద్రిస్తున్న సమయంలోనే హత్య చేసింది. సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిని తానే హత్య చేసినట్లు యువతి ఒప్పుకుంది. అయితే, ఇందుకు కారణాలను విని పోలీసులు షాక్ అయ్యారు. వ్యభిచారం చేయాలని తనపై తల్లి ఒత్తిడి చేసిందని పోలీసులతో చెప్పింది యువతి. అందుకే హత్య చేసినట్లు తెలిపింది. దీంతో ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: కూతురిపై వేధింపులు.. తల, కాళ్లు నరికి తండ్రి ప్రతీకారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.