ETV Bharat / bharat

అమ్మానాన్నల 'కష్టాల సాగు'.. చెల్లిని చూసుకుంటూనే పదేళ్ల బాలిక 'అక్షర సేద్యం'

author img

By

Published : Apr 3, 2022, 3:28 PM IST

A girl attends school with sister: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిందండ్రులు కష్టాల సాగు చేస్తుంటే.. 10 ఏళ్ల చిన్నారి చెల్లిని చూసుకుంటూనే అక్షర సేద్యం చేస్తోంది. చెల్లిని ఎత్తుకుని పాఠాలు వింటున్న చిన్నారి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ పాప ఎవరు? ఆ స్టోరీ ఏంటి?

A girl attends school with sister
చెల్లిని చూసుకుంటూ పాఠశాలకు పదేళ్ల బాలిక

A girl attends school with sister: పదేళ్ల వయసులో తమను తాము చూసుకోవటమే గగనం. పాఠశాలకు వెళ్లేందుకు రోజు పొద్దున అమ్మ సిద్ధం చేస్తే కానీ వెళ్లలేము. అయితే.. ఓ పదేళ్ల బాలిక స్కూల్​కు వెళ్లటమే కాదు.. తన చెల్లిని చూసుకుంటోంది. తల్లిదండ్రులు తమ భవిష్యత్తు కోసం రేయింబవళ్లు పొలంలో కష్టాల సాగు చేస్తుంటే.. తన చెల్లిని చూసుకుంటూనే అక్షర సేద్యం చేస్తోంది. తరగతి గదిలో చెల్లెలిని ఎత్తుకుని పాఠాలు వింటోంది. మణిపుర్​లోని తామెంగ్లాంగ్​ జిల్లాకు చెందిన ఆ చిన్నారి ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

తామెంగ్లాంగ్​కు చెందిన 10 ఏళ్ల బాలిక మీనింగ్సిన్లియు పమీ.. తన చెల్లితో పాటు పాఠశాలకు హాజరవుతోంది. సోదరి ఆలనాపాలనా చూసుకుంటూనే పాఠాలు వింటోంది. చెల్లెలిని ఎత్తుకుని ఉన్న ఫొటో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తోంగమ్​ బిశ్వజిత్​ సింగ్​ వద్దకు చేరింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఇతర భాజపా నేతలను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్​లో షేర్​ చేశారు మంత్రి.

  • Her dedication for education is what left me amazed!

    This 10-year-old girl named Meiningsinliu Pamei from Tamenglong, Manipur attends school babysitting her sister, as her parents were out for farming & studies while keeping her younger sister in her lap. pic.twitter.com/OUIwQ6fUQR

    — Th.Biswajit Singh (@BiswajitThongam) April 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చదువుపట్ల ఆమెకు ఉన్న అంకితభావం నన్ను ఆశ్చర్యపరిచింది. సోషల్​ మీడియాలో ఈ వార్త విన్నవెంటనే వారి కుటుంబాన్ని గుర్తించి ఆ చిన్నారిని ఇంపాల్​కు తీసుకురావాలని తెలిపాం. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు తన బాధ్యత తీసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాను. ఆమె అంకితభావానికి గర్వపడుతున్నా. "

- తోంగమ్​ బిశ్వజిత్​ సింగ్​, మణిపుర్​ వ్యవసాయ శాఖ మంత్రి.

ఇదీ చూడండి: మానవత్వం నిలిపిన ప్రాణం.. పసిగుండెను కాపాడేందుకు తరలిన జనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.