ETV Bharat / bharat

ఇంట్లో నుంచి గెంటేసిన బిడ్డలపై 76 ఏళ్ల తల్లి పోరాటం.. చివరకు..

author img

By

Published : Jan 9, 2022, 3:47 PM IST

Old lady legal battle against children: కన్నబిడ్డలపైనే న్యాయపోరాటానికి దిగి విజయం సాధించారు ఓ వృద్ధురాలు. 76 ఏళ్ల వయసులో కోర్టును ఆశ్రయించి.. తనకు అనుకూలమైన తీర్పు తెచ్చుకున్నారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

old lady wins legal battle against her children
old lady wins legal battle against her children

Old lady legal battle against children: కర్ణాటకలో ఇంట్లో నుంచి గెంటేసిన పిల్లలపై న్యాయపోరాటానికి దిగిన ఓ వృద్ధురాలు ఎట్టకేలకు విజయం సొంతం చేసుకున్నారు. కన్నతల్లికి కనీసం కూడు, గూడు కల్పించకుండా వదిలించుకోవాలని చూసిన సంతానానికి.. న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.

Mother legal battle against children

హవేరీ జిల్లా హనగల్ తాలూక వీరపుర గ్రామంలో నివాసం ఉండే ప్రేమవ్వ హవలన్నవర్(76)ను కన్నబిడ్డలే ఇంట్లో నుంచి పంపించేశారు. ఆరేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె సంరక్షణను చూసుకోకుండా.. ఇద్దరు కొడుకులు, కుమార్తె ముఖం చాటేశారు. ఆస్తి మొత్తం తీసేసుకొని కనీసం తిండి పెట్టకుండా, ఏడాది క్రితం ఇంట్లో నుంచి పంపించేశారు.

old lady wins legal battle against her children
ప్రేమవ్వ

Karnataka Old lady case on children

ఏ దిక్కూ లేకుండా పోయిన ప్రేమవ్వ.. హవేరీ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'స్వధార్ గృహ్'లో చేరారు. ఈ కేంద్రాన్ని నడిపించే పరిమళ జైన్.. ప్రేమవ్వ గురించి తెలుసుకొని న్యాయసహాయానికి హామీ ఇచ్చారు. 'సవనురూ అసిస్టెంట్ కమిషనర్స్ కోర్టు' ద్వారా ప్రేమవ్వ కొడుకులిద్దరికీ నోటీసులు పంపించారు. ఇద్దరు కుమారులు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున ప్రేమవ్వకు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కుమారులిద్దరూ నోటీసును బేఖాతరు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. వీరికి ఉన్న ఆరెకరాల పంట భూమిలో మూడెకరాలను ప్రేమవ్వకు ఇవ్వాలని ఆదేశించింది.

old lady wins legal battle against her children
ప్రేమవ్వ ఆశ్రయం పొందిన కేంద్రం

"మీరు(ప్రేమవ్వ) జీవించి ఉన్నంతవరకు ఈ స్థలాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అనంతరం ఇది మీ పిల్లలకు బదిలీ అవుతుంది. ఒకవేళ ఆస్తిపై మీ సంతానం గొడవపడితే.. దాన్ని పూర్తిగా పొందకుండా నిరోధిస్తాం."

-న్యాయస్థానం ఆదేశాలు

గతం గుర్తు చేసుకుంటూ ఆవేదన...

కోర్టు ఆదేశాల పట్ల ప్రేమవ్వ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థాన పోరాటంలో తనకు అండగా నిలిచిన పరిమళ జైన్, హనగల్ తహసీల్దార్ యరిస్వామి, డిప్యూటీ ఎస్పీ అన్నపూర్ణలకు కృతజ్ఞతలు చెప్పారు.

old lady wins legal battle against her children
తనకు సాయం చేసిన పరిమళ జైన్​తో ప్రేమవ్వ

"నా పిల్లలు, ముఖ్యంగా నా కూతురు, అల్లుడు నా జీవితాన్ని నాశనం చేశారు. వారిని చూసి నా కొడుకులు, కోడళ్లు.. నన్ను పట్టించుకోవడం మానేశారు. స్వధార్ గృహ్ కేంద్రం చిరునామా ఇచ్చి, వంద రూపాయలు చేతిలో పెట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. పరిమళ జైన్ సహా స్వధార్ గృహ్​లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు న్యాయం దక్కేలా చూశారు. పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత నాకు ఇలా జరగడం బాధిస్తోంది" అంటూ తన ఆవేదనను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు ప్రేమవ్వ.

old lady wins legal battle against her children
.

ఇదీ చదవండి: రూ.7లక్షలు ఖర్చుతో కుక్క బర్త్​డే పార్టీ- ముగ్గురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.