కానిస్టేబుల్​గా ఐదేళ్ల చిన్నారి.. నియామక పత్రంతో పాటు చాక్లెట్స్​..

author img

By

Published : Jan 7, 2023, 7:48 PM IST

Updated : Jan 7, 2023, 8:41 PM IST

child constable got compassionate appointment
చైల్డ్​ కానిస్టేబుల్​ ()

ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ఓ ఐదేళ్ల చిన్నారిని చైల్డ్​ కానిస్టేబుల్​గా నియమించింది. కొన్ని రోజుల క్రితం ఎస్సైగా విధులు నిర్వర్తించే చిన్నారి తండ్రి మృతి చెందిన కారణంగా పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పోలీసులు శనివారం చిన్నారికి చాక్లెట్​లతో పాటు నియామక పత్రం అందించారు.

ఐదేళ్ల చిన్నారిని చైల్డ్​ కానిస్టేబుల్​గా నియమించింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం. బాలుడి తండ్రి అకాలమరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పోలీసు శాఖ తెలిపింది. ఆ చిన్నారికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పూర్తి స్థాయి కానిస్టేబుల్​గా నియమితులవుతారని ఎస్​డీపీఓ ప్రకాశ్​ సోనీ తెలిపారు. శనివారం ఉదయం చిన్నారికి నియామకపత్రంతో పాటుగా చాక్లె​ట్స్​ని కూడా అందించారు సూరజ్​పుర్​ జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహు.

ఇదీ జరిగింది
సూరజ్​పుర్​ జిల్లాకి చెందిన హరి ప్రసాద్​ కొరియా జిల్లాలో ఎస్సైగా విధులు నిర్వర్తించేవారు. కొన్ని రోజుల క్రితం హరిప్రసాద్ మరణించారు. వెంటనే కారుణ్య నియామకం కింద వారి కుటుంబంలో ఒకరికి పోస్టింగ్​ ఇవ్వాలని సుర్గుజా రేంజ్​ ఐజీ రామ్​గోపాల్​ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో వెంటనే సూరజ్​పుర్ ఎస్పీ రామకృష్ణ సాహు ఈ ప్రక్రియను​ పూర్తి చేశారు. శనివారం ఉదయం చిన్నారి హరేంద్ర సింగ్ పంక్రాకు అతని తల్లి సమక్షంలో చైల్డ్ కానిస్టేబుల్​గా నియామకపత్రం అందించారు జిల్లా ఎస్పీ. గతంలో కూడా సూరజ్​పుర్​ పోలీస్ శాఖ ఇదే తరహాలో ఓ చిన్నారిని చైల్డ్​ కానిస్టేబుల్​గా నియమించింది.

child constable got compassionate appointment
చిన్నారికి నియామక పత్రం అందిస్తున్న జిల్లా ఎస్పీ
Last Updated :Jan 7, 2023, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.