ETV Bharat / bharat

ఆస్తి కోసం అరాచకం.. మహిళపై గ్యాంగ్​ రేప్.. ప్రైవేట్​ భాగాల్లో రాడ్డు చొప్పించి మరీ దారుణం

author img

By

Published : Oct 19, 2022, 4:28 PM IST

36 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. ఈ దారుణానికి ఆస్తి తగాదానే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గాజియాబాద్​లో జరిగింది. పంజాబ్​ లూథియానాలో జరిగిన మరో ఘటనలో.. తనకు ఇష్టమైన కూర వండలేదని తల్లిని చంపేశాడు ఓ తనయుడు.

delhi gangrape case
delhi gangrape case

ఉత్తర్​ ప్రదేశ్​ గాజియాబాద్​లో దారుణం జరిగింది. 36 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. రెండు రోజుల పాటు అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రైవేట్​ భాగాల్లో ఇనుప రాడ్డులను చొప్పించారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి ఆస్తి తగాదానే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్​ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

నందగ్రామ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసించే బాధితురాలు.. అక్టోబర్​ 16న తన సోదరుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బయలుదేరింది. రోడ్డుపై ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. ఐదుగురు వ్యక్తులు వచ్చి ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. బాధితురాలిని అపహరించిన నిందితులు రెండు రోజుల పాటు ఆమెపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రైవేట్​ భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు కట్టేసి రోడ్డుపై వదిలేసి వెళ్లారు. బాధితురాలు రోడ్డుపై కనిపించేవరకు ఇనుప రాడ్డు ఆమె ప్రైవేట్​ భాగాల్లోనే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలిపారు.

కూర వండలేదని తల్లిని చంపిన తనయడు: తనకు ఇష్టమైన కూర వండలేదని తల్లిని చంపేశాడు ఓ తనయుడు. ఈ దారుణ ఘటన పంజాబ్​ లూథియానాలోని అశోక్​ నగర్​లో జరిగింది.
ఇష్టమైన కూర వండలేదని ఆగ్రహించిన కుమారుడు సురీందర్​ సింగ్​.. తన తల్లి చరణ్​జీత్​ను దారుణంగా కొట్టాడు. మేడపై నుంచి కిందకు తోసి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన చరణ్​జీత్​ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సురీందర్ సింగ్​ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు.

.
కుమారుడు సురీందర్ సింగ్​

సోషల్​ మీడియాలో పరిచయం.. పార్క్​కు పిలిచి రేప్​ : 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో వెలుగు చూసింది. సోషల్​ మీడియాలో పరిచయమైన వ్యక్తే.. పబ్లిక్ పార్కులో ఈ దారుణానికి తెగబడ్డాడు. బాలిక తన తల్లి ఫోన్​లో ఇన్​స్టాగ్రామ్​ వినియోగిస్తుండగా.. కాన్పుర్​కు చెందిన విద్యాసాగర్​ కుశ్వాహతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే లఖ్​నవూలోని లోహియా పార్కులో కలుసుకుందామని పిలిచాడు. అక్కడకు వచ్చిన బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాన్పుర్ వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గుజరాత్​లో పనిచేస్తాడని.. బాలికను కలిసేందుకే స్వగ్రామమైన కాన్పుర్​ వచ్చి.. అక్కడినుంచి లఖ్​నవూ చేరుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

అత్తింటిపై పెట్రోల్​ పోసి ఐదుగురిని చంపిన అల్లుడు ఆత్మహత్య : పంజాబ్​లో అత్తింటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించి ఐదుగురిని సజీవ దహనం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖుర్​సైద్​పుర గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య తన మాట వినడం లేదని ఆగ్రహించిన భర్త.. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనమయ్యారు.

ఇదీ జరిగింది
పరమ్​జీత్​ కౌర్​ అనే మహిళ మెహతాపుర్​ సమీపంలోని మద్దేపుర్ గ్రామం​లో నివసిస్తోంది. పేద కుటుంబానికి చెందిన పరమ్​జీత్ కౌర్..​ మొదట పెళ్లి చేసుకోగా.. ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం భర్త చనిపోవడం వల్ల ఖుర్​సైద్​పురకు చెందిన ఖాలోతో రెండో వివాహం చేశారు. మొదట్లో బాగానే ఉన్న ఖాలో.. కొన్ని రోజుల తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలను విడిచిపెట్టాలని చెప్పేవాడు. దీనికి కౌర్​ ఒప్పుకోకపోవడం వల్ల తీవ్రంగా కొట్టేవాడు. అతడి వేధింపులకు తాళలేక పిల్లలను వెంటబెట్టుకుని పుట్టింటికి వచ్చింది. ఎంత చెప్పినా భార్య మాట వినడం లేదని ఆగ్రహించిన ఖాలో.. అతడి స్నేహితులతో కలిసి మద్దేపుర్​లోని అత్తింటికి వచ్చాడు. ఎవరూ బయటకు రాకుండా ఇంటి తలుపులు మూసి పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. ఈ ప్రమాదంలో పరమ్​జీత్​ కౌర్​, ఆమె తండ్రి సుర్జన్​ సింగ్, తల్లి జోగింద్రో దేవి, పిల్లలు గల్మోహర్​, అర్ష్​దీప్​ సజీవ దహనమయ్యారు.

11 ఏళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం : దిల్లీ వాజీరాబాద్​లో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు పక్కింట్లో నివసించే వ్యక్తి. ఈ విషయం బయట చెపితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఈ ఘటన సెప్టెంబర్​లో జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి: మరో మోగ్లీ.. బట్టలంటే మహా చిరాకు.. కాలేజీకి వెళ్లినా అండర్​వేర్​పైనే..

'కశ్మీర్ దేశస్థులను ఏమని పిలుస్తారు?'.. ఏడో తరగతి ప్రశ్నాపత్రంపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.