ETV Bharat / bharat

తలసేమియా ఉందని రక్త మార్పిడి.. నలుగురు పిల్లలకు హెచ్​ఐవీ.. ఒకరు మృతి

author img

By

Published : May 26, 2022, 2:51 PM IST

HIV Blood Transfusion: బ్లడ్​ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారులు హెచ్​ఐవీ బారినపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగిందీ ఘటన.

hiv blood transfusion
తలసేమియా ఉందని రక్త మార్పిడి.. నలుగురు పిల్లలకు హెచ్​ఐవీ.. ఒకరు మృతి

HIV Blood Transfusion: కొందరి నిర్లక్ష్యం.. ప్రమాదకర వ్యాధితో పోరాడుతున్న నలుగురు చిన్నారుల పాలిట శాపమైంది. ఇప్పటికే తలసేమియా బారినపడిన వారికి కొత్తగా హెచ్​ఐవీ సోకింది. ఆ నలుగురు పిల్లల్లో ఒకరు మరణించారు. మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగిన ఈ ఘటనను ఆ రాష్ట్ర వైద్యశాఖ తీవ్రంగా పరిగణించింది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

రక్త మార్పిడితో.. నలుగురు చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సలో భాగంగా వారికి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఓ బ్లడ్ బ్యాంక్​ నుంచి రక్తం తీసుకొచ్చి వారికి ఎక్కించారు. అయితే.. "పిల్లలకు పరీక్షలు జరపగా హెచ్​ఐవీ పాజిటివ్​గా తేలింది. బ్లడ్​ బ్యాంక్​ ఇచ్చిన కల్తీ రక్తం ఎక్కించడం వల్ల వారికి హెచ్​ఐవీ, హెపటైటిస్ బీ సోకాయి. తలసేమియాతో బాధపడే చిన్నారులకు ఎక్కించే రక్తానికి ఎన్​ఏటీ(న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్) చేయించడం తప్పనిసరి. అయితే.. బ్లడ్ బ్యాంక్​లో ఆ సదుపాయం లేకపోవడం వల్ల పిల్లలు హెచ్​ఐవీ బారినపడ్డారు" అని వివరించారు డాక్టర్ విక్కీ రుఘ్వానీ.

ప్రభుత్వం సీరియస్: "నలుగురు చిన్నారులకు హెచ్​ఐవీ సోకింది. వారిలో ఒకరు మరణించారు. పూర్తి సమాచారం సేకరిస్తాం. ఉన్నతస్థాయి విచారణ తర్వాత దోషులపై చర్య తీసుకుంటాం. ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్​మెంట్​ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఇకపై తలసేమియా రోగులకు ఇచ్చే రక్తానికి ఎన్​ఏటీ పరీక్ష జరిగేలా చూస్తాం." అని స్పష్టం చేశారు మహారాష్ట్ర వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్​కే దకాటే.
గతంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. తలసేమియాతో బాధపడుతున్న రోగులకు రక్తం ఎక్కించగా.. ఐదుగురు హెపటైటిస్ సీ, ఇద్దరు హెపటైటిస్ బీ బారినపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.