ETV Bharat / bharat

Coronavirus update: దేశంలో మరో 30,256 కరోనా కేసులు

author img

By

Published : Sep 20, 2021, 10:02 AM IST

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య(Coronavirus update) స్వల్పంగా తగ్గింది. తాజాగా 30,256 మంది​ వైరస్​​ (Corona virus India) బారినపడ్డారు. మరో 295 మంది చనిపోయారు. ఆదివారం ఒక్కరోజే 43,938 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు.

Coronavirus update
దేశంలో కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా​ కేసుల సంఖ్య (Coronavirus update) ఆదివారం కాస్త తగ్గింది. కొత్తగా 30,256 మందికి కొవిడ్​ పాజిటివ్​గా (Coronavirus India) తేలింది. మరో 295 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 43,938 మంది వైరస్​ను (Corona update) జయించారు.

  • మొత్తం కేసులు: 33,478,419
  • మొత్తం మరణాలు: 4,45,133
  • మొత్తం కోలుకున్నవారు: 3,27,15,105
  • యాక్టివ్ కేసులు: 3,18,181

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 80,85,68,144 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక్కరోజే 37,78,296 వ్యాక్సిన్​ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో (Global corona virus update) తగ్గుదల కనిపించింది. తాాజాగా 3,50,897 మందికి కరోనా (Corona update) సోకినట్లు తేలింది. మహమ్మారి​ ధాటికి మరో 5,748 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,92,91,098కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,05,472కు పెరిగింది.

ఆయా దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 32,731
  • బ్రెజిల్ - 9,458
  • రష్యా - 20,174
  • బ్రిటన్ - 29,612
  • టర్కీ - 26,398
  • ఇరాన్ - 15,975

ఇదీ చూడండి: Kerala Covid Cases: కేరళలో 19వేలకుపైగా కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.