ETV Bharat / bharat

కేరళలో తగ్గని ఉద్ధృతి.. మరో 29,682 మందికి వైరస్

author img

By

Published : Sep 4, 2021, 10:53 PM IST

కేరళలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా 29,682 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 142 మంది మరణించారు.

Kerala cases
కేరళలో తగ్గని ఉద్ధృతి

కేరళలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. శనివారం కొత్తగా 29,682 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 142 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 21,422కు చేరింది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17.54గా ఉంది.

మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందంటే..

  • మహారాష్ట్రలో తాజాగా 4,130 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 64మంది కరోనాతో మృతిచెందారు. కొత్తగా 2,506 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ముంబయిలో కొత్తగా 416 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా కొత్తగా నలుగురు మృతిచెందారు. తాజాగా 382 మంది కోలుకున్నారు.
  • కర్ణాటకలో కొత్తగా 983మంది మహమ్మారి బారిన పడ్డారు. కొత్తగా 21మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ నుంచి మరో 1,620 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో కొత్తగా 1,575 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మహమ్మారితో మృతిచెందినవారి సంఖ్య 35వేలకు చేరింది. కొత్తగా 1,610 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • మిజోరాంలో కొత్తగా 825 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందారు. శనివారం కొవిడ్ సోకిన వారిలో 203 మంది చిన్నారులే ఉన్నారు.
  • ఒడిశాలో కొత్తగా 681కేసులు బయటపడ్డాయి. వారిలో 118 మంది చిన్నారులే ఉన్నారు. తాజాగా మరో ఐదుగురు మహమ్మారి కారణంగా మృతిచెందారు.

66.07 కోట్ల వ్యాక్సిన్ డోసులు..

ఇప్పటివరకు 66.07 కోట్ల కొవిడ్​-19 వ్యాక్సిన్​ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 4.49 కోట్ల డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఉన్నాయని తెలిపింది.

68 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 62.25లక్షల డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొంది.

'వారికి టీకా చాలా అవసరం..'

60ఏళ్లు నిండినవారికి కొవిడ్ సెకండ్ డోస్ ఇవ్వటంపై దృష్టి సారించాలని ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్​కు సూచించింది కేంద్రం. కొన్ని ఈశాన్యరాష్ట్రాల్లో టీకా సెకండ్ డోస్ పంపిణీ సంతృప్తికరంగా లేదని పేర్కొంది. 60ఏళ్లు దాటినవారికి కొవిడ్-19 టీకాలు ఇవ్వటం ఎంతో ముఖ్యం అని తెలిపింది.

ఈ మేరకు జమ్ముకశ్మీర్, లద్దాఖ్​, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపుర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురకు చెందిన అధికార ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అసోం, మణిపుర్, నాగాలాండ్, మేఘాలయాలో 60ఏళ్లు దాటినవారికి టీకా అందివ్వటం అసంపూర్తిగా సాగిందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: Covid 19 r value: మళ్లీ పెరిగిన ఆర్​-ఫ్యాక్టర్.. థర్డ్​వేవ్​ తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.