ETV Bharat / bharat

విమానంలో సీటు కింద 24 బంగారు బిస్కెట్లు- పక్కా ప్లాన్​తో...

author img

By

Published : Jan 6, 2022, 11:05 AM IST

Gold biscuits under flight seat: బంగారాన్ని విమానంలోని సీటు కింద దాచి తరలిస్తుండగా కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 24 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.37 కోట్లు ఉంటుందని చెప్పారు.

Gold biscuits under flight seat
విమానం సీటు కింద బంగారం స్మగ్లింగ్​

Gold biscuits under flight seat: కర్ణాటక కెంపెగౌడ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విమానం సీటు కింద దాచిన 24 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.37 కోట్లు ఉంటుందని చెప్పారు.

ఎలా పట్టుకున్నారంటే..?

Gold smuggling in flight: దుబాయ్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయానికి ఇండిగో ఎయిర్​లైన్స్​కు చెందిన 6E 096 విమానం.. మంగళవారం ఉదయం 10:30 గంటలకు చేరుకుంది. ఆ సమయంలో ప్రయాణికులు అందరూ కిందకు దిగారు. విమానంలో భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో... బెంగళూరు కస్టమ్స్ అధికారులు విమానాన్ని పూర్తిగా గాలించారు. ఓ సీటు కింద బూడిద రంగు టేపులో సీల్ చేసిన రెండు కడ్డీ లాంటి వస్తువులను అధికారులు గుర్తించారు. వాటిని తెరిచి చూడగా.. అందులో 24 బంగారు బిస్కెట్లు కనిపించాయి.

పథకం ప్రకారమే స్మగ్లర్​... బంగారు బిస్కెట్లను విమానంలోని సీటు దాచిపెట్టారని అధికారులు తెలిపారు. వాటిని తమ స్మగ్లింగ్​ ముఠాకు చెందిన మరో వ్యక్తి పొందేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న పసిడి బరువు 2.8కిలోలు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి: Bihar girl google job: ఈమె జీతం రూ.కోటిపైనే

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు- కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.