ETV Bharat / bharat

దేశంలోనే తొలిసారి.. తమిళనాడులో 'డీఎన్​ఏ సెర్చ్​ టూల్'

author img

By

Published : Nov 20, 2021, 8:58 PM IST

వివిధ నేరవిభాగాల్లో ఉపయోగపడే 'ఫోరెన్సిక్ డీఎన్​ఏ ప్రొఫైల్ సెర్చ్​ టూల్​'ను తమిళనాడు ప్రభుత్వం తీసుకువచ్చింది. సీఎం ఎమ్​కే స్టాలిన్​ దీనిని ప్రారంభించారు. దేశంలో ఈ సాంకేతికతను వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.

DNA search tool
ఫోరెన్సిక్ డీఎన్​ఏ ప్రొఫైల్ సెర్చ్​ టూల్

నేరస్థులను పసిగట్టడానికి ఉపయోగపడే 'ఫోరెన్సిక్ డీఎన్​ఏ ప్రొఫైల్ సెర్చ్​ టూల్​'ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ప్రారంభించారు. ముఖ్యంగా.. తప్పిపోయిన, కిడ్నాప్​కు గురైన పిల్లలను డీఎన్​ఏ ఆధారంగా పసిగట్టి తమ తల్లిదండ్రుల చెంతకు చేర్చగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.

DNA search tool
ఫోరెన్సిక్ డీఎన్​ఏ ప్రొఫైల్ సెర్చ్​ టూల్

డీఎన్​ను సాంకేతికతతో మిళితం చేసే టెక్నాలజీని విదేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. మనదేశంలో ఈ సాంకేతికత వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అంతరాష్ట్ర నేరస్థులను కనిపెట్టడం, తరచూ నేరాలకు పాల్పడేవారిని పసిగట్టడం, గుర్తుతెలియని మృతదేహాలను, అస్థిపంజరాలను గుర్తించడం వంటి పనులు ఈ సాంకేతికతతో సులభమవుతాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:బాలికపై లైంగిక వేధింపులు.. లేఖ రాసి ఆత్మహత్య

మహంత్​ అనుమానాస్పద మృతిపై సీబీఐ ఛార్జిషీటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.