ETV Bharat / bharat

12 ఏళ్లకే గర్భం.. ప్రియుడితో గుట్టుగా పెళ్లి.. వరుడికి పోలీసుల షాక్!​

author img

By

Published : Mar 25, 2022, 4:08 PM IST

Girl pregnant before marriage: పొరుగింటిలోని యువకుడితో ప్రేమలో పడి 12 ఏళ్లకే గర్భం దాల్చింది ఓ బాలిక. ఆ విషయం తెలిసి పరువు పోతుందనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా వారికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. అయితే, వారికి షాక్​ ఇచ్చారు పోలీసులు. అత్యాచారం నేరం కింద వరుడిని అరెస్ట్​ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో జరిగింది.

Girl pregnant before marriage
వివాహం

Girl pregnant before marriage: ఓ 12 ఏళ్ల బాలిక పొరుగింటి యువకుడిని ప్రేమించి.. సన్నిహితంగా మెలిగింది. దీంతో గర్భం దాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా వారికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. సమాచారం అందుకున్న పోలీసులు మండపానికి చేరుకుని అత్యాచారం నేరం కింద వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది: నాగ్​పుర్​, ఎంఐడీసీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ కాలనీలో 12 ఏళ్ల బాలిక నివాసం ఉంటోంది. ఆమెకు తల్లి లేదు. తండ్రి కూలి పనులు చేసుకుంటూ పోషిస్తున్నాడు. పని ధ్యాసలో పడి కుమార్తె ఏం చేస్తుందని గమనించలేకపోయాడు. ఈ క్రమంలోనే పొరుగింటిలో ఉండే యువకుడి(22)తో ప్రేమలో పడి గర్భం దాల్చింది బాలిక. ఇది తెలుసుకున్న బాలిక తండ్రి.. సమాజంలో తమ పరువు పోతుందని భయపడ్డాడు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయటానికి బదులుగా యువకుడి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇరువురికి గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేశారు. తమ బిడ్డను పెళ్లి చేసుకుంటే కొత్త ఇల్లు కట్నంగా ఇస్తామని హామీ ఇచ్చాడు ఆ తండ్రి.

మైనర్​కు వివాహం చేస్తున్నారని ఆశా కార్యకర్తకు తెలియగా.. దీనిపై ఎంఐడీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే మండపానికి చేరుకున్న పోలీసులు బాల్యవివాహల నిరోధక చట్టం 2006 కింద వరుడిని అరెస్ట్​ చేశారు. వధువుకు వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చినట్లు నిర్ధరణ అయింది. వరుడిపై అత్యాచారం కేసు సైతం నమోదు చేశారు.

ఇదీ చూడండి: ప్రేమకథ విషాదాంతం.. చిన్న గొడవకే అమ్మాయి ఆత్మహత్య.. భయంతో అబ్బాయి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.