ETV Bharat / bharat

104 ఏళ్ల 'టాపర్​' బామ్మ.. 89 శాతం మార్కులతో..

author img

By

Published : Nov 13, 2021, 8:43 AM IST

Updated : Nov 13, 2021, 2:06 PM IST

'104 ఏళ్ల వయసు(104 year old woman).. అయితే ఏంటి బాసూ?' అంటోంది ఓ బామ్మ!(old lady) పట్టుదలతో రాయడం నేర్చుకుంది. ఆ తర్వాత.. అక్షరాస్యత పరీక్షల్లో పాల్గొని, 89శాతం మార్కులతో టాపర్​గా నిలిచింది. ఇంతకీ ఆ బామ్మ ఎవరు? ఈ వయసులోనూ తను రాయడం ఎలా నేర్చుకుంది? అంటే..

104 year old lady in literacy examination
104 ఏళ్ల బామ్మ

సాధించాలనే తపన ఉండాలేగానీ వయసుతో పనేముంది? నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలేగానీ ఎప్పుడైతే ఏంటి? కేరళకు చెందిన ఓ బామ్మ(old lady) ఈ ప్రశ్నలకు సమాధానంలా నిలుస్తోంది. 104 ఏళ్ల వయసులో(104 year old woman) రాయడం నేర్చుకుని, అక్షరాస్యత పోటీల్లో 89శాతం మార్కులు సాధించింది.

అయార్​కున్నమ్​ ప్రాంతానికి చెందిన కుట్టియమ్మకు.. చదవడం వచ్చు. రాయడం తెలియదు. 104 ఏళ్ల వయసులోనూ(104 year old woman) ఆమె రాత కూడా నేర్చుకోవాలనుకుంది. కుట్టియమ్మ ఆసక్తిని గ్రహించిన కున్నుంపురం ప్రాంతానికి చెందిన ప్రేరక్​ రహానా.. ఆమెకు రాత నేర్పడంలో సాయం చేశారు. ప్రతిరోజు సాయంత్రం కుట్టియమ్మ ఇంటికి వచ్చి, ఆమెకు రాయడంలో మెలకువలు నేర్పించారు. రహానా సహకారంతో పాఠాలతో కుస్తీ పట్టింది కుట్టియమ్మ. ఆ తర్వాత.. కేరళ ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యత పరీక్షలో పాల్గొంది. మలయాళం, గణితంలో జరిగే ఈ పరీక్షలో 89 శాతం మార్కులు సాధించింది.

104 year old lady in literacy examination
104 ఏళ్ల కుట్టియమ్మ
104 year old lady in literacy examination
వార్తపత్రిక చదువుతూ
104 year old lady in literacy examination
పుస్తకం చదువుతున్న కుట్టియమ్మ
104 year old lady in literacy examination
కుట్టియమ్మ ఉపాధ్యాయరాలు రహానా

రాయడం నేర్చుకునేటప్పుడు కుట్టియమ్మ ఎంతో సంతోషపడేదని ఉపాధ్యాయురాలు రహానా తెలిపారు. కుట్టియమ్మకు కేవలం వినడంలోనే కొద్దిగా సమస్యలు ఉన్నాయని.. అంతకుమించి ఇతర అనారోగ్య సమస్యల్లేవని చెప్పారు. ఈ వయసులోనూ... ఆమె అద్దాలు లేకుండా స్పష్టంగా చూడగలదని పేర్కొన్నారు. కుట్టియమ్మ భర్త టీకే కొంఠి 2002లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె తన పిల్లలతో కలిసి ఉంటోంది.

కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఈ అక్షరాస్యత పరీక్షలో మొత్తం 509 మంది పాల్గొన్నారు. అయారకున్నమ్​ ప్రాంతం నుంచి మొత్తం ఏడుగురు పరీక్షలు రాశారు. అందులో అందరూ పాస్​ అవగా కుట్టియమ్మనే టాపర్​గా నిలిచింది.

ఇవీ చూడండి:

ప్రియుడి కోసం లింగమార్పిడి చేసుకున్న యువకుడు.. చివరకు!

గిరిజన ఉత్సవాల్లో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి అదిరే స్టెప్పులు

Last Updated : Nov 13, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.