సరికొత్త పంథాలో చోరీ.. కారు ముందు నోట్లు విసిరి.. తెలివిగా బురిడీ!

By

Published : Apr 19, 2022, 7:33 PM IST

thumbnail

Kolhapur Theft: మీరు ఎన్నో దొంగతనాలను చూసుండొచ్చు. కానీ ఈ మధ్య కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. మహారాష్ట్ర కోల్హాపుర్​లో సోమవారం(ఏప్రిల్​ 18) ఇలాంటి ఘటనే జరిగింది. రైల్వే క్రాసింగ్​ రోడ్​ వద్ద ఓ కారు ఆగి ఉంది. అందులో నుంచి పట్టపగలే.. ఆ వ్యక్తి కళ్లుగప్పి మొబైల్​ ఫోన్లు, ల్యాప్​టాప్​ చోరీ చేసింది ఓ ముఠా. ఇందుకోసం కొత్త పంథా అనుసరించింది. మొదట.. అటు నుంచి నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి కారు ముందు నోట్లు విసిరాడు. కారు డోర్​ తీసి డబ్బులు పడిపోయాయని అతడికి చెబుతుండగా.. ఆ దొంగల బృందంలోని మరో ఐదారుగురు కారును చుట్టుముట్టారు. కారులోని వ్యక్తి దృష్టి మరల్చి.. దొంగతనానికి పాల్పడ్డారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు వైరల్​గా మారాయి. ఫుటేజీ ఆధారంగా నిందితులను వెతికేపనిలో పడ్డారు పోలీసులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.