Pratidwani: అయోమయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. ఆర్థిక లావాదేవీల్లో లెక్కాపత్రమేది ?

By

Published : Mar 26, 2022, 8:57 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

లెక్కా పత్రం లేదు. రూ.48 వేల కోట్లు ఎటుపోయాయో తెలియడం లేదు. ఏడాదిలో 103 రోజులు ఓవర్‌డ్రాఫ్ట్‌లోనే రాష్ట్రం. రాష్ట్ర ఆర్ధిక నిర్వహణపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ చేసిన పరిశీలన ఇది. రూ.వేలకోట్ల లావాదేవీలు కోడ్‌కు విరుద్ధంగా ఎలా చేశారన్నది కాగ్‌ సంధించిన సూటి ప్రశ్న. మరీ ముఖ్యంగా.. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో.. ఒక లక్షా పదివేల కోట్లకు పైగా చట్టసభల ఆమోదం లేకుండానే కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఎలా ఖర్చు చేశారు? బడ్జెట్‌లో చెప్పాపెట్టకుండా.. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వేల కోట్ల రూపాయల మేర రుణాలు ఎందుకు తీసుకుంటున్నట్లు? ఆ మొత్తాల్ని ఏం చేస్తున్నట్లు? గందరగోళం అయోమయంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ ఈ ఆర్ధికముఖచిత్రంపై నిపుణులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.