Vande Bharat Express: రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు.. విజయవాడ - చెన్నై మధ్య పరుగులు

By

Published : Jul 3, 2023, 2:02 PM IST

thumbnail

Vijayawada To Chennai Vande Bharat Express : రాష్ట్రంలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది.. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈ నెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని నరంద్ర మోదీ దేశ వ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ వందేభారత్‌ రైలు 8 వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

విజయవాడ నుంచి చెన్నై మధ్య ఏయే స్టేషన్లలో రైలు ఆగుతుందో తెలియజేయడంతో పాటు రాకపోకల షెడ్యూల్, టిక్కెట్ ధరలు మొదలైన వివరాలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. విజయవాడ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదగా చెన్నై వెళ్లి అదే మార్గంలో తిరిగి రానుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న విషయం అందరికి తెలిసిందే. మరో వందే భారత్ ఎక్స్​ప్రెస్ అందుబాటులోకి వస్తుందని తెలియడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు పరుగులు పెడుతుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్‌ మధ‌్య కూడా మరో రైలు నడుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.