"దొంగ ఓట్ల స్క్రీన్‌ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌దే - వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 3:05 PM IST

thumbnail

TDP Leader Neelayapalem Vijay Kumar Fire On YSRCP Government : రాష్ట్రంలో నమోదైన దొంగ ఓట్ల వెనక కథ, స్క్రీన్‌ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌దేనని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. రామ్‌ ఇన్‌ఫో 'ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (Field Operating Agency)' పేరుతో దొంగ ఓట్ల (Fake Votes) కార్యక్రమం జరుగుతోందని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Vijay Kumar On Village Volunteers : ఫాం-7 వినియోగం పూర్తిగా ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణలో ఉంచాలని విజయ్‌కుమార్‌ కోరారు. ప్రభుత్వ డేటా అసలు ఎలా బయటకెళ్తోందని, ప్రభుత్వ సిస్టమ్‌లోకి ప్రైవేటు వ్యక్తులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. వాలంటీర్లలో 90 శాతం వైసీపీ క్యాడరేనని మంత్రులే బహిరంగాగా చెప్పారని గుర్తు చేశారు. గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేశారు.

TDP Leaders on Illegal Votes in Andhra Pradesh : గ్రామ వాలంటీర్ల మానిటరింగ్‌కు "ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఏజెన్సీ"ని పెట్టారని విమర్శించారు. వైసీపీ సహాయంతో "రామ్‌ ఇన్‌ఫో (Ram Info)" ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ ఉందని, వాలంటీర్ల ద్వారా డేటాను సేకరిస్తోందని, ఆ డేటా మొత్తం ఐప్యాక్‌కు చేరుతోందని ఆరోపించారు. రామ్‌ ఇన్‌ఫో పేరుతో ఐప్యాక్‌ (I-PAC) ప్రైవేటు సంస్థ ప్రభుత్వంలోకి వచ్చిందని విమర్శించారు. జీవో లేకుండా ఐప్యాక్‌-3 ప్రైవేటు సంస్థలు సమాచార సేకరణ చేస్తున్నాయని విజయ్‌కుమార్‌ ఆక్షేపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.