Protests in America Against CBN Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఆమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు..

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 9:44 AM IST

Updated : Sep 16, 2023, 10:14 AM IST

thumbnail

Protests in America Against CBN Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అమెరికాలో పెద్దఎత్తున తెలుగు ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో ఆరోపణలతో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నిరసనలు రాష్ట్రాలనూ మాత్రమే కాదు.. ఖండాలను దాటుకుని వెళ్లాయి. ఇతర దేశాలలోని తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా న్యూజెర్సీలో తెలుగుదేశం- జనసేన జెండాలతో తెలుగు ప్రజలు భారీ ర్యాలీ తీశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకొచ్చిన విద్యా ప్రమాణాల వల్లే తామంతా విదేశాల్లో స్థిరపడ్డామని ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు. దీనిపై తమకు 'న్యాయం కావాలి - చంద్రబాబు విడుదల కావాలి' అనే నినాదాలతో హోరెత్తించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్దఎత్తున నినదించారు. సైకో పోవాలి- సైకిల్ రావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ధ్వజమెత్తారు.  

Last Updated : Sep 16, 2023, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.