Pawan Kalyan Inspected Red Mud Dunes: 'ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద... ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం ఆపాలి'

By

Published : Aug 16, 2023, 7:47 PM IST

Updated : Aug 17, 2023, 6:26 AM IST

thumbnail

Pawan Kalyan Inspected Red Mud Dunes in Bhimili: భీమిలిలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల విధ్వంసాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పరిశీలించారు. ఎర్రమట్టి దిబ్బలు.. వాటిని విధ్వంసం చేసిన తీరును జనసేన నేత సందీప్​.. పవన్‌కు వివరించారు. అనంతరం పవన్ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద అని అన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బలు 1,200 ఎకరాలు ఉండేవి ఇప్పుడు 292 ఎకరాలే మిగిలాయని అన్నారు. ఎర్రమట్టి దిబ్బల రక్షణ గురించి పర్యావరణశాఖ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జాతీయ సంపదైన ఎర్రమట్టి దిబ్బలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.. ఇక్కడ కంచె లేదా బఫర్​ జోన్​ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎర్రమట్టి దిబ్బల వద్ద స్థిరాస్తి వెంచర్లు వేస్తున్నారు.. దీనిని వెంటనే ఆపాలి.. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే.. ఎర్రమట్టి దిబ్బల కోసం నేషనల్​ ట్రిబ్యునల్​కి వెళ్తామని​ అన్నారు. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం ఆపాలి.. వైసీపీ నాయకుల దోపిడీలు ఆగాలి అని పవన్​ కల్యాణ్​ పేర్కొన్నారు. 

Last Updated : Aug 17, 2023, 6:26 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.