Meeting on Child Rights in Narsipatnam: ఏపీని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: గొండు సీతారాం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 1:44 PM IST

thumbnail

Meeting on Child Rights in Narsipatnam: బాల్య వివాహాల నిరోధానికి అందరూ కంకణం కట్టుకొని, ఈ దురాచారాన్ని సమాజం నుంచి రూపుమాపాలని  ఆంధ్రప్రదేశ్​ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. దీని సంబంధించి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 31ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బందితో ఏర్పాటైన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్​ను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహాలో జరిగే వివాహాలకు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు గొండు సీతారాం సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కనకారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. 
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.