Man Dies Due To Delay In Arrival Of Ambulance 108 వాహనం ఆలస్యమైంది.. వ్యక్తి ప్రాణాలు పోయాయి
Published: May 13, 2023, 10:38 PM

Man Dies Due To Delay In Arrival Of Ambulance: ప్రాథమిక ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడం, ఫోన్ చేసిన వెంటనే 108 వాహనం రాకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో జరిగింది. హుకుంపేటలో ఓ పెళ్లి కోసం ప్రవీణ్ అనే యువకుడు టెంటు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే బంధువులు ఆటోలో పక్కనే ఉన్న హుకుంపేట ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గాని సిబ్బంది గాని ఎవరూ లేకపోవడంతో వేచి చూసి 108 వాహనానికి ఫోన్ చేసిన అనంతరం వాహనం ఆలస్యంగా రావడంతో .....గంట తర్వాత బాధితుడిని పాడేరులోని ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపించారు.
ప్రవీణ్ కి కరెంట్ షాక్ తగిలిన 5 నిమిషాలకే ఆసుపత్రికి తరలించాము. బాబుకు ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రి తీసుకురాగా హాస్పటల్లో ఏఎన్ఎమ్, నర్సులు, డాక్టర్లు, సిబ్బంది ఎవరూ లేరు. దీంతో 108 వాహనానికి ఫోన్ చేయగా అది కూడా ఆలస్యం కావడంతో మా బాబు ప్రాణాలు పోయాయి.- మృతుని బంధువు