Global Summit Review: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ఒప్పందాలపై సీఎస్ సమీక్ష..

By

Published : Jun 20, 2023, 12:30 PM IST

thumbnail

Global Summit Review: విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో వివిధ కంపెనీలతో చేసుకున్న అవగాహనా ఒప్పందాలలో చాలా వరకు కార్యరూపం దాల్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్న ఒప్పందాలపై సంబంధిత కార్యదర్శులతో సీఎస్ సమీక్షించారు. వివిధ కంపెనీలతో 13 లక్షలకు పైగా విలువైన ఒప్పందాలు కుదరగా.. వీటికి సంబంధించి 2వేల 749 కోట్ల వ్యయంతో 14 ప్రాజెక్టులను ప్రారంభించినట్టు తెలిపారు. మరో 106 ప్రాజెక్టులు నిర్మాణ, గ్రౌండింగ్ దశలో ఉన్నట్టు C.S. వివరించారు. మిగతా ప్రాజెక్టులన్నీ అనుమతులు, భూకేటాయింపు, D.P.R తయారీ వంటి దశల్లో ఉన్నాయని చెప్పారు. ఈనెల 22వ తేదీన 1,775 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేయనున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోడ్రజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, కృష్ణా జిల్లాలో సుక్సుమా గామా ఎల్ఎల్పీ, తిరుపతి జిల్లాలో సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజెస్, శ్రీకాకుళం జిల్లాలో నాగార్జున అగ్రికెం, నెల్లూరు జిల్లాలో క్రిబ్కో, విశ్వ సముద్ర ప్రాజెక్టులు ఉన్నాయని సీఎస్ తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.