డాక్టర్​ కాదు చీటర్​ - MBBS సీటు ఇప్పిస్తానని రూ.18 లక్షలకు టోకరా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 8:22 PM IST

thumbnail

Doctor Cheated taking 18 lakhs to give MBBS Seat: నిస్వార్థంగా రోగులకు వైద్యం అందించే పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి మోసాలకు పాల్పడుతున్న డాక్టర్​​ను, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ సీట్లు ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసాడని ఓ మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ సీటు కోసం విడతల వారీగా డబ్బులు చెల్లించి 8నెలలు అవుతున్నా సీటు రాలేదేంటని ప్రశ్నించినందుకు దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. 

ఇదీ జరిగింది: నెల్లూరు జిల్లాలో అనిత అనే వివాహిత పిండిమిల్లు నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఈమె కుమారుడు నీట్‌ పరీక్షలకు ప్రయత్నిస్తున్నాడు. నీట్​లో ఆశించిన స్థాయిలో ర్యాంకు రాకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయాన్ని డాక్టర్ వృత్తిలో ఉన్న అశ్వనీకుమార్ ఆసరాగా తీసుకున్నాడు. రూ.18లక్షలు ఇస్తే మెడికల్ సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మిన అనిత డాక్టర్​కు విడతల వారీగా డబ్బులు చెల్లించింది. డబ్బులు చెల్లించి 8నెలలు కావొస్తున్నా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అనిత అశ్వినీకుమార్​ను నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన డాక్టర్‌, మరో ఇద్దరు కలిసి ఆమెపై దాడి చేశారు. తీవ్రగాయాలతో  వైద్యచికిత్స తీసుకున్న అనంతరం అనిత  పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఈమె ఫిరాద్యుతో నిందుతులపై 307కేసు  నమోదు చేసి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.