Attack for Obstructing Illegal Sand Transport: ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించినందుకు వైసీపీ నేతపై దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 10:02 PM IST

thumbnail

Attack for Obstructing Illegal Sand Transport: ఇసుక రవాణా వల్ల పలువురు రహదారిపై పడి గాయాలపాలవుతున్నారని, వెంటనే ఇసుక రవాణాను ఆపివేయాలంటూ ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతపై ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ అక్రమ ఇసుక రవాణాపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారని బాధితుడు వైఎస్సార్సీపీ నాయకుడు జక్కరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

YSRCP Leader Zakkaraiah Comments: ''ఎంపీ నందిగం సురేష్ అక్రమ ఇసుక రవాణాపై ప్రశ్నించినందుకు నాపై తీవ్రంగా దాడి చేశారు. పార్టీ కోసం కష్టపడినందుకు నాపై దాడి చేస్తారా..? కరకట్టపై అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణా చేసే సమయంలో అది రహదారిపై పడి అనేక మంది గాయాలపాలవుతున్నారు. రెండు రోజుల క్రితం నేను కూడా ప్రమాదానికి గురయ్యాను. ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసులకు అప్పగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. న్యాయం చేయాలంటూ సీడ్ యాక్సిస్ రహదారిపై ఆందోళన చేపడితే.. పోలీసులు వచ్చి ఆందోళన విరమించాలని, లేకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా నేను ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా నన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు'' అని వెంకటపాలేనికి చెందిన వైసీపీ నాయకుడు జక్కరయ్య కన్నీంటిపర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.