బుగ్గన రాజకీయ కక్ష- టీడీపీ నాయకులపై అక్రమ కేసులు - illegal cases on TDP leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 12:34 PM IST

Updated : May 15, 2024, 12:50 PM IST

thumbnail
బుగ్గన రాజకీయ కక్ష- టీడీపీ నాయకులపై అక్రమ కేసులు (ETV Bharat)

TDP Leders Arrest In Nandyala : నంద్యాల జిల్లా డోన్​లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి టీడీపీ నాయకులపై కేసులు పెట్టి, రాజకీయ కక్షతో అరెస్టులు చేయిస్తున్నారు. ఎన్నికల సమయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో ప్యాపిలికి చెందిన కేడీసీసీ డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్వో మల్లారెడ్డి కుటుంబం, సీమ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరారు. పార్టీ మారి నందుకు ఆర్థిక మంత్రి వీరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయంచారు. ఆరుగురిని బుదవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి బనగానపల్లె స్టేషన్​కు తరలించారు.  

సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని లేకుంటే డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పడంతో పోలీసులు సుజాతమ్మ ఇంటి వద్ద మోహరించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున నిరసనలు, ఆందోళన వద్దంటూ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని కోట్ల సుజాతమ్మ, సూర్య ప్రకాష్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగానే పోవాలని టీడీపీ డోన్ అభ్యర్థి సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.

Last Updated : May 15, 2024, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.