AP Irrigation Association President: "కృష్ణా జలాల కేటాయింపు పునఃసమీక్షపై.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలి"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 12:11 PM IST

Updated : Oct 7, 2023, 12:20 PM IST

thumbnail

AP Irrigation Association President: కృష్ణా జలాల కేటాయింపును పునఃసమీక్షించాలన్న కేంద్రం నిర్ణయంపై.. సాగునీటి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులకు సంబంధించి తుది అవార్డు ప్రకటించకుండానే.. మరోమారు కృష్ణా జల వివాదాలు-2 ట్రెబ్యునల్‌కు పునఃసమీక్షకు అప్పగించడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షులు దీనిపై స్పందిస్తూ.. ఇది రాష్ట్రానికి తీరని శరఘాతామని అన్నారు. 2020 ఏపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలోనే.. దీనిపై కేసీఆర్​ దృష్టిపెట్టారన్నారు. ఉమ్మడి ఆంధ్రకు సుమారు 800 టీఎంసీల జలాలు కేటాయించటం.. 2015లో కేఆర్​ఎంబీ సమావేశంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌.. బచావత్​కు అనుగుణంగా చెప్పిందని అన్నారు. 519 టీఎంసీలు ఏపీకి.. 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమైన వివరాలను గుర్తు చేశారు. ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున కోర్టులో కేసులు దాఖలు చేస్తామంటున్న ఆ సంఘం అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Last Updated : Oct 7, 2023, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.