Old Lady Sarpanch: ఏ కార్యక్రమాలకు పిలవటం లేదు.. మహిళా సర్పంచ్ ఆవేదన

By

Published : Jun 2, 2023, 9:15 PM IST

Updated : Jun 3, 2023, 6:29 AM IST

thumbnail

Old Lady Sarpanch Crying : ఎన్టీఆర్​ జిల్లా నందిగామ నియోజవర్గంలో 75 సంవత్సరాల వృద్ధ సర్పంచ్​ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామ సర్పంచ్​గా తాను ఉండగా.. తన ప్రమేయం లేకుండానే గ్రామంలోని పనులు ఇతరులకు అప్పగిస్తున్నారని సర్పంచ్​ ఆవేదన వ్యక్తం చేశారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామపంచాయతి సర్పంచ్​ ఆల చిన్న సైదమ్మ.. తనను ప్రోటోకాల్​ ప్రకారం గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు పిలవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మొండితోక జగన్​మోహన్​ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్​ కుమార్​పై ఆరోపణలు కురిపించారు. వారిద్దరూ సొంత నిధులతో లక్ష్మీపురం గ్రామంలో ఎన్​ఎస్​పీ కాలువ మరమ్మతుల పనులను ప్రారంభించి వెళ్లిపోయారని వివరించారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని సొంత పార్టీ సర్పంచ్​నైనా తనను కాదని గ్రామంలో నిర్వహించే పనులను కూడా.. వైసీపీలోని ఇతర నాయకులకు అప్పగిస్తున్నారని వాపోయారు. పార్టీ కోసం ఎంతో కృషి చేశానని అంతేకాకుండా.. శాసనసభ ఎన్నికలో కూడా ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశామని తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే పులుసు పార్థసారథితో తమకు బంధుత్వం ఉందని ఆయనను ఓ కార్యక్రమానికి పిలిస్తే.. తనకు తెలియకుండా ఎలా పిలుస్తారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : Jun 3, 2023, 6:29 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.