ETV Bharat / sukhibhava

తొలి కలయికకు వాటిపై అవగాహన ఉండాల్సిందే!

author img

By

Published : Dec 18, 2021, 6:38 AM IST

Sex Education: తొలి కలయికలో సక్సెస్​ సాధించాలంటే శృంగారంపై సరైన అవగాహన అవసరం అని నిపుణులు అంటున్నారు. ఇందుకుగల కారణాలేంటో వివరిస్తున్నారు.

why sex education is important in family life
తొలిసారి కలయికకు సెక్స్​పై అవగాహన

Sex Education: సృష్టి ముందుకు సాగాలి అంటే రతి మనుషుల మధ్య తప్పని సరిగా జరగాల్సిందే. దీనిని చాలా మంది తప్పుగా చూడడం వల్ల చిన్ననాటి నుంచి మనలో కూడా అలాంటి ఆలోచనలే పురుడు పోసుకున్నాయి. అనుభవిస్తే కానీ దాని మాధుర్యం తెలియని స్థాయికి చాలా మంది చేరుకున్నారు. అయితే మొదటి సారి భాగస్వామితో కలవాలి అంటే ఎంతో మందికి ఓ విధమైన భావన ఉంటుంది. అందుకే శృంగారంపై మనకు సరైన అవగాహన ఉండాలని అంటున్నారు నిపుణులు.

సెక్స్ విజ్ఞానం మనిషికి చాలా అవసరం. ఓ మంచి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్​ చేయాలంటే దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఇందుకు ప్రధాన కారణం మనలో ఉన్న అనుమానాలు, అపోహాలు. ఇటు మగవారిలో, అటు మహిళల్లో చాలా డౌట్స్​ వారిని తొలిచి వేస్తుంటాయి.

అంగం చిన్నగా ఉంటే సెక్స్ సరిగా చేయలేను అని భావిస్తుంటారు మగవారు. ఎంజాయ్​ చేయలేకపోవడానికి నరాల్లో బలహీనత కారణం అని అనుకుంటారు. అలాగే మహిళలు కూడా యోని మార్గం చిన్నగా ఉంటే సరిగా రతి క్రీడలో ఎంజాయ్​ చేయలేమని భావిస్తుంటారు. అందుకే అంగ ప్రవేశం జరగ్గానే చెప్పలేని బాధ కలుగుతుందని అనుకుంటారు. ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. అందుకే మహిళలు, పురుషుల్లో లైంగిక విజ్ఞానం తప్పని సరి అంటున్నారు నిపుణులు.

సెక్స్​పరంగా మంచి విజ్ఞానం ఉంటే వారి జీవితం చాలా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మన బాడీలోని అవయవాల పని తీరు గురించి అవగాహన ఉండాలి. దీనితో పాటు సెక్స్​ సైకాలజీ గురించి కూడా తెలుసుకుని ఉండాలని అంటున్నారు. దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Sex Positive Education: అలా సెక్స్​ చేస్తే.. పిల్లలు పుట్టరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.