ETV Bharat / sukhibhava

కళ్లు పొడిబారుతున్నాయా? ఇలా చేస్తే హాయిగా ఉంటుంది!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 2:37 PM IST

Home Remedies for Dry Eyes : గంటలు గంటలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌తో గడిపేస్తూ.. కళ్లకు హానిచేస్తున్నారు జనం. పని ఒత్తిడి వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే.. అలిసిన కళ్లకు సరైన విశ్రాంతి ఇవ్వకపోతే.. అనేక సమస్యలు మొదలవుతాయి. అలాంటి వాటిల్లో మొదట వచ్చే సమస్య కళ్లు పొడిబారడం. అసలు ఈ సమస్య ఏంటి..? దాని లక్షణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

Home Remedies for Dry Eye
Home Remedies for Dry Eyes

Home Remedies for Dry Eyes in Telugu: ప్రపంచం మొత్తం డిజిటల్‌ మయమైంది. పిల్లల దగ్గర్నుంచీ పెద్దవాళ్ల వరకూ మొబైళ్లు, ల్యాప్​టాప్​లు, టీవీలకు అంకితమయ్యే పరిస్థితి వచ్చింది. వాటితోనే గంటలు గంటలు కాలక్షేపం చేస్తున్నారు. దీని ఫలితమే కళ్లు పొడిబారడం. చలికాలంలో ఈ ఇబ్బంది మరింత పెరిగి.. ఇతర సమస్యలకూ దారి తీయొచ్చు. మరి.. ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దాని లక్షణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఈ సమస్య ఎందుకు వస్తుంది?: కళ్లలో సరిపడా నీళ్లు ఉత్పత్తి కానప్పుడు ఈ సమస్య వస్తుంది. కంటి ఆరోగ్యంలో లాక్రిమల్‌ గ్రంథులది ప్రధాన పాత్ర. వీటి నుంచి ఉత్పత్తయ్యే లిక్విడ్స్‌ ఎప్పటికప్పుడు కళ్లను శుభ్రపరచి కాపాడుతుంటాయి. రోజూ ఐదు నుంచి ఆరు గంటలు స్మార్ట్‌ఫోన్‌ వాడే వారిలో ఈ లిక్విడ్స్​ ఉత్పత్తి తగ్గిపోయి.. కళ్లు డ్రైగా అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

లక్షణాలు: కళ్లు మంటగా ఉండటం, తరచుగా దురద రావడం, ఎర్రగా మారడం, మసకగా కనిపించడం, మూసుకుపోవడం, ఉబ్బడం, కళ్ల నుంచి నీళ్లు రాకపోవడం.. ఇవన్నీ కళ్లు పొడిబారుతున్నాయని చెప్పే లక్షణాలు. వీటిని మొదట్లోనే గుర్తించి.. జాగ్రత్త పడటం మంచిది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏఏ చిట్కాలు పాటించాలంటే..

మొటిమలు, నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? - ఇలా ఈజీగా పోగొట్టండి!

  • శుభ్రం చేయాలి: కళ్లు మంటలు పుడుతున్నాయంటే.. ముందు గోరువెచ్చని నీటిలో ముంచి పిండేసిన మెత్తటి వస్త్రంతో కళ్లను తుడిచి, కాసేపు వాటిపై అలానే ఉంచాలి. ఇలా పలుమార్లు చేస్తే సాంత్వన కలుగుతుంది. తద్వారా కళ్లు ఎర్రబడటం, మంట వంటివి తగ్గుతాయి.
  • కొబ్బరినూనె: ఇది కంటికి తేమను అందిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. కొద్దిగా కాటన్​ తీసుకుని కొబ్బరి నూనెతో తడిపి, కనురెప్పలపై పావుగంట ఉంచితే సరి. వేడి తగ్గి, చల్లదనం కలుగుతుంది. అయితే మరీ నూనె కారేలా తీసుకోవద్దు. రసాయనాలతో కూడినవి కాకుండా సేంద్రియ రకాలను ఎంచుకుంటే మేలు.

పెదవులు నల్లగా ఉన్నాయా? - ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

కలబంద: ఇది పొడిబారిన కళ్లకి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కళ్లు ఉబ్బినప్పుడు దీన్ని ప్రయత్నించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు, ఎరుపుని తగ్గిస్తాయి. కలబందను శుభ్రంగా కడిగి.. లోపలి గుజ్జుతో కంటి చుట్టూ మృదువుగా మర్దనా చేసి, అయిదు నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అయితే కళ్లలోకి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి.

  • రోజ్‌వాటర్‌: అలసిన కళ్లకి ఇది మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్‌ ఎ తేమను అందిస్తుంది. రోజ్‌వాటర్‌లో ముంచిన దూది లేదా వస్త్రాన్ని కళ్లపై 5 నిమిషాలు పెట్టుకోవాలి. నిద్రించే ముందు ఇలా చేస్తే సరి. అయితే రోజ్​ వాటర్ సేంద్రియ పద్ధతిలో తయారు చేసినదేనా అని చెక్‌ చేసుకోవడం తప్పనిసరి.

గమనిక: ఏదో ఒకసారి అయితే వీటిని ప్రయత్నించవచ్చు. కళ్లు తరచూ పొడిబారి ఇబ్బంది కలుగుతోంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

హైపర్ ​ఎసిడిటీ సమస్యా? - ఈ ఆయుర్వేద పదార్థాలతో తగ్గించుకోండి!

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.