ETV Bharat / sukhibhava

ఆకాకరకాయతో బీపీ, షుగర్​కు చెక్​!

author img

By

Published : Oct 21, 2021, 5:35 PM IST

Updated : Oct 23, 2021, 7:53 AM IST

ఔషధ గుణాలు ఎక్కువ ఉన్న కాయగూరల్లో ఆకాకరకాయ ఒకటి. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు, మధుమేహం కంట్రోల్​ అవడమే కాక అనేక ఆరోగ్య సమస్యలకు చెక్​ పెట్టొచ్చు.

spiny gourd
ఆకాకరకాయతో బీపీ, షుగర్​లకు చెక్​!

కాలానుగుణంగా లభించే కాయగూరలు, పండ్లలో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అలాంటి వాటిలో ఆకాకరకాయ కూడా ఒకటి. మరి దీనివల్ల కలిగే లాభాలేంటో చూద్దామా..

  • దీనిలో పోషకాలతోపాటు ఔషధ గుణాలూ ఎక్కువే. పీచు అధిక మొత్తంలోనే ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
  • ఆకాకరకాయను తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలోని యాంటీలిపిడ్‌ పెరోక్సిడేటివ్‌ సమ్మేళనాలు ధమనుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  • ఈ కాయల్లోని యాంటీ అలర్జిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • తక్కువ కెలొరీలుండే కూరగాయ ఇది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది శరీరానికి కావాల్సిన తేమనూ అందిస్తుంది.
  • దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌ ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయి. ఇది కాలేయాన్ని రక్షించి, కొవ్వు పేరుకు పోకుండా చూస్తుంది.
  • ఇందులోని కెరోటినాయిడ్స్‌ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  • ఇవి రక్తంలోని చక్కర స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి మధుమేహులూ వీటిని తీసుకోవచ్చు.
  • మలబద్ధకం ఉన్నవారు దీన్ని ఆహారంలో చేర్చుకుంటే ఆ ఇబ్బంది క్రమంగా తగ్గిపోతుంది.

ఇదీ చూడండి : Diet Plan For Weight Loss: ఒంట్లో కొవ్వు కరిగించాలా? ఇవి తినండి...

Last Updated :Oct 23, 2021, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.