ETV Bharat / sukhibhava

నిద్ర రావట్లేదా? - అల్లం, అశ్వగంధతో డీప్​ స్లీప్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 10:14 AM IST

Ayurvedic Drinks for Better Sleep: రాత్రి ఎంత హాయిగా నిద్రపోతే.. ఉదయం అంత ఉల్లాసంగా నిద్రలేస్తారు. కానీ.. ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కొన్ని డ్రింక్స్​ ట్రై చేయాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు!

Ayurvedic Drinks for Better Sleep
Ayurvedic Drinks for Better Sleep in Night

Ayurvedic Drinks for Better Sleep : "అబ్బా నైట్​ మొత్తం నిద్రపట్టలేదు".. ఈరోజుల్లో చాలా మంది నోటి నుంచి వినిపించే కామన్​ డైలాగ్​. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసిన వారు.. మరుసటి రోజు నీరసంగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బద్ధకం. దానికి తోడు ఏదైనా వర్క్​ చేస్తుంటే.. అదే పనిగా నిద్ర వస్తుంది. ఈ కండిషన్ తీవ్రంగా ఉంటే.. సమస్య నుంచి బయట పడేందుకు నిద్రమాత్రలు వేసుకుంటారు కొందరు. కానీ.. దీని వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే.. ఈ సమస్యకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మిలమిల మెరిసే గోళ్లు మీ సొంతం కావాలా? ఈ టిప్స్ పాటిస్తే సరి!

అశ్వగంధ టీ: అశ్వగంధకి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించి.. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదొక అడాప్టోజెనిక్ హెర్బ్. నాడీ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. 1 లేదా 2 టీస్పూన్ల అశ్వగంధ పొడిని ఒక కప్పు వేడి నీరు లేదా పాలలో వేసుకుని 5 నిమిషాలు మరిగించుకుని టీ లాగా తయారు చేసుకొని.. చల్లారిన తర్వాత తేనె కలిపి తీసుకోవచ్చు.

2019లో "Journal of Alternative and Complementary Medicine"లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. అశ్వగంధ పొడిని 8 వారాల పాటు తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి.. ప్రశాంతమైన నిద్ర పడుతుందట. దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య ఉన్న వృద్ధులలో కార్టిసాల్​ స్థాయులు తగ్గుతాయని తేలిందట.

నొప్పులకు పెయిన్ కిల్లర్స్ చాలా డేంజర్ - ఈ నేచురల్ టిప్స్ పాటించండి! - ఫుల్ రిలీఫ్

కుంకుమ పువ్వు-యాలకులు: కుంకుమ పువ్వు, యాలకులు మంచి నిద్రను అందిస్తాయి. గోరు వెచ్చని పాలు/ నీటిలో కొన్ని కుంకుమ పువ్వు, చిటికెడు యాలకుల పొడిని కలుపుని తాగొచ్చు.

పసుపు-పాలు: జలుబు, ఫ్లూ వచ్చినప్పుడు అందరూ విరివిగా ఉపయోగించేవి పసుపు - పాలు. నిద్రను ప్రేరేపించడంలో ఈ మిశ్రమం చక్కగా సహాయపడుతుందట. ఇందులోని కర్కుమిన్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా హాయిగా నిద్ర పట్టేలా చేస్తుందని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గోరువెచ్చని నీరు తాగే అలవాటుందా? లేదా? - అయితే తప్పకుండా చదవండి!

బ్రహ్మీ టీ: బ్రహ్మి లేదా బాకోపా మొన్నీరి.. ఆయుర్వేదంలో అత్యంత విలువైన మొక్క ఇది. ఈ మొక్కతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. 1 టీస్పూన్ పొడిని ఒక కప్పు వేడి నీటిలో కలిపి.. 10 నిమిషాల తర్వాత తాగాలి. 2015లో "Journal Ayu"లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. బ్రహ్మీ టీ ని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర మెరుగవుతుందని తేలింది.

అల్లం-పాలు: ఒక చిన్న ముక్క అల్లం ముక్కను తురిమి, ఒక గ్లాసు పాలలో వేసి, 5 నిమిషాలు మరిగించి తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అలాగే నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

గమనిక: మీరు ఏ టీని ఎంచుకున్నా.. నిద్ర పోవడానికి 2 గంటల ముందుగానే తాగాలి. నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలతో ఎన్నో లాభాలు- రొమ్ము క్యాన్సర్​కు చెక్​!- నార్మల్​ డెలివరీకి ఛాన్స్!!

అది సాధారణ రోగం కాదు - క్యాన్సర్​ కావొచ్చు - ఇలా గుర్తించండి!

ఆ కూరగాయలను వండకుండా తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.