ETV Bharat / state

'పంటనంతా కొనుగోలు చేసి ఆదుకోండి'

author img

By

Published : May 1, 2020, 10:06 PM IST

turmeric farmers facing problems with limitations in crop purchases
turmeric farmers facing problems with limitations in crop purchases

కడప జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు పసుపు కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. కడప, రాజంపేట, మైదుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో శుక్రవారం నుంచి అధికారికంగా పసుపు కొనుగోళ్లు చేపట్టారు. అయితే ఒక్కో రైతు నుంచి కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటం నిరాశ పరుస్తోంది.

'పంటనంతా కొనుగోలు చేసి ఆదుకోండి'

పసుపు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పసుపు క్వింటాల్ 6850 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. గ్రామ వాలంటీర్ల ద్వారా కడప జిల్లాలోని పసుపు రైతులకు టోకెన్లు ఇంటింటికి పంపిణీ చేశారు. కడప, రాజంపేట, మైదుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పసుపు కొనుగోళ్లు ప్రారంభించారు. చెన్నూరు, సీకే దిన్నె మండలాలకు చెందిన రైతుల నుంచి పసుపు కొన్నారు. రెండు రకాలుగా పండించే పసుపు నాణ్యతను డీసీఎంఎస్, మార్క్ ఫెడ్, ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 7 వేల మంది రైతులకు సంబంధించిన 10 వేల ఎకరాల్లో సాగు చేసిన పసుపును ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

పసుపు కొనుగోళ్ల సందర్భంగా మార్కెట్ యార్డులో పనిచేసే కాటాదారులు ఆందోళన చేశారు. గుర్తింపు కార్డులు కలిగిన తమను కాదని డీసీఎంఎస్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో పసుపు తూకాలు వేయిస్తున్నారని ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్ధి చెప్పారు. అయితే ఒక్కో రైతు నుంచి కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే కాకుండా పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి

అన్నదాతల కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.