ETV Bharat / state

కాశీ విశ్వశ్వరుడి చెంత కోటి శివలింగాలు, తయారీలో మునిగితేలిన కడప వాసులు..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 1:30 PM IST

Shivlingas_Manufacturing_in_YSR_District
Shivlingas_Manufacturing_in_YSR_District

Shivlingas Manufacturing in YSR District: కార్తీకమాసం సందర్భంగా కాశీలోని విశ్వనాథుడి చెంత కోటి శివలింగాలు ఉంచి ప్రత్యేక పూజలు చేసే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా వైఎస్సార్ జిల్లాకు ఐదు లక్షల శివలింగాలు తయారు చేసే బాధ్యత అప్పగించారు. ఈ మేరకు జిల్లాలోని మహిళలు శివనామస్మరణలతో శివలింగాల తయారీలో మునిగితేలిపోయారు.

Shivlingas_Manufacturing_in_YSR_District

Shivlingas Manufacturing in YSR District: హిందూవుల ఆరాధ్యదైవం పరమ మహాశివుడికి ఎంతో ఇష్టమైన కార్తీకమాసం. ఆశ్వయువజ అమావాస్య నుంచి మరుసటి రోజు కార్తీక పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు ఉండే కార్తీక మాసం మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మాసంలో నోములు, వ్రతాలతో పాటు దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివారాధన చేయటం వల్ల పుణ్యఫలితాలు వస్తాయని హిందూవుల అపార నమ్మకం.

Shivlingas Preparation for Kasi Temple: ఈ నేపథ్యంలో కార్తీకమాసం సందర్భంగా కాశీలోని విశ్వనాథుడి చెంత కోటి శివలింగాలు ఉంచి ప్రత్యేక పూజలు చేసే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఐదు లక్షల శివలింగాలు తయారు చేసే బాధ్యతను వైఎస్సార్ జిల్లాకు అప్పగించారు. దీంతో జిల్లాలోని మహిళలు గత పది రోజుల నుంచి శివలింగాల తయారీలో బిజీ బిజీగా ఉన్నారు. జిల్లాలోని వివిధ ట్రస్టుల ఆధ్వర్యంలో కాశీ నుంచి తెప్పించిన ప్రత్యేక మట్టితో ఒక్కో శివలింగాన్ని 30 గ్రాముల బరువుతో తయారు చేస్తున్నారు.

ఆలయ పుష్కరిణిలో బయటపడిన పురాతన శివలింగాలు

Women Manufacturing Shivlingas: కడపలో అనేక ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని శివలింగాలను తయారు చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి.. నియమ నిష్టలతో మహిళలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఏకధాటిగా శివలింగాల తయారీలో మునిగితేలిపోయారు. శివలింగం రూపంలో ఉన్న అచ్చులలో మట్టివేసి శివలింగాలను తయారుచేసి వాటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. తయారుచేసిన శివలింగాలను ప్రత్యేకంగా కొన్ని గదుల్లో భద్రపరిచారు.

Shivlingas Manufacturing: ఈ శివలింగాలను మరో రెండు మూడు రోజుల్లో ప్యాకింగ్ చేసి ప్రత్యేకంగా కాశీకి తరలించనున్నారు. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి శివలింగాలను.. వారి ప్రాంతాలకు పంపించనున్నారు. ఒక్కో హిందూ కుటుంబానికి ఒక్కో శివలింగాన్ని ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శివలింగం తయారుచేసే భాగ్యం తమకు రావడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

మూడు అతి సూక్ష్మ బంగారు శివలింగాలు..!

YSR District Women Manufacturing Shivlingas: ఎంతో ఉత్సాహంతో ఏమాత్రం అలసట లేకుండా తొమ్మిది రోజులపాటు మహిళలందరూ ఒక కుటుంబంలాగా కలిసిమెలసి శివలింగాలను తయారు చేశామని తెలిపారు. ఇలాంటి అద్భుత భాగ్యం గతంలో ఎన్నడూ తమకు దక్కలేదని పేర్కొన్నారు. శివలింగాల తయారీ బాధ్యత తమకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నామని మహిళలు చెప్పారు.

" శివలింగం తయారుచేసే భాగ్యం తమకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఉత్సాహంగా ఏమాత్రం అలసట లేకుండా తొమ్మిది రోజులపాటు మేమంతా ఒక కుటుంబంలాగా కలిసిమెలసి శివలింగాలను తయారు చేశాం. ఇలాంటి అద్భుత భాగ్యం గతంలో మాకు ఎన్నడూ దక్కలేదు. శివలింగాల తయారీ బాధ్యత మాకు అప్పగించడాన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాం." - శివలింగాల తయారీలో పాల్గొన్న మహిళలు

నెల రోజులపాటు 11 వేల 111 లింగాలకు అర్చన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.