ETV Bharat / state

50 ఏళ్ల నిరీక్షణకు తెర... అందుబాటులోకి వంతెన

author img

By

Published : Dec 23, 2019, 11:27 PM IST

cm jagan launched high level railway bridge in rayachoti
వంతెనను ప్రారంభిస్తున్న సీఎం జగన్

కడప శివారులోని రాయచోటి రైల్వే గేటు వద్ద నిర్మించిన హై లెవల్ రైల్వే వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ దీనిని ప్రారంభించారు.

50 ఏళ్ల నిరీక్షణకు తెర... అందుబాటులోకి వంతెన

కడప రాయచోటి రైల్వే గేట్ వద్ద రూ. 82 కోట్లతో నిర్మించిన రైల్వే వంతెనను ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ప్రారంభించారు. 50 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ వంతెన నిర్మాణం ఇప్పటికి పూర్తికావటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. సీఎం జగన్ అక్కడినుంచి రిమ్స్​కు వెళ్లారు. ఆ తరువాత ప్రత్యేక హెలికాఫ్టర్​లో ఇడుపులపాయకు వెళ్లారు. రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 25వ తేదీ కుటుంబ సభ్యులతో కలసి పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.

ఇదీ చదవండి:ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం: సీఎం జగన్‌

Intro:ap_cdp_17_23_cm_jagan_rob_open_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప రాయచోటి రైల్వే గేట్ వద్ద 82 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే వంతెన ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 50 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి ఆయన రిమ్స్ కు వెళ్లి అక్కడ ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. రేపు, ఎల్లుండి జిల్లాలో ముఖ్యమంత్రి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. 25వ తేదీ కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.


Body:ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.