ETV Bharat / state

దువ్వలో తయారవుతున్న కర్నల్ సంతోష్​బాబు విగ్రహం

author img

By

Published : Jun 29, 2020, 1:35 PM IST

Statue of Colonel Santosh Babu
దువ్వలో కర్నల్ సంతోష్​బాబు విగ్రహం

గాల్వన్ లోయలో డ్రాగన్ దేశ కుయుక్తులకు అమరులైన కర్నల్ సంతోష్​బాబు విగ్రహం పశ్చిమగోదావరి జిల్లాలో రూపుదిద్దుకుంటోంది. వీర సైనికుడి విగ్రహాన్ని శిల్పులు తీర్చిదిద్దుతున్నారు.

భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్​ సంతోష్​బాబు విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో రూపుదిద్దుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్​బాబు విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్టించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కైకవరంలో ఆర్యవైశ్య సంఘం నిర్ణయించింది. ఈ విగ్రహ తయారీ బాధ్యతలను తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన సీఎస్ కళానిలయం నిర్వాహకులకు అప్పగించారు. శిల్పకళా నిలయ అధినేత చంద్రశేఖర్... విగ్రహం జీవం ఉట్టిపడేలా తుది మెరుగులు దిద్దుతున్నారు. సంతోష్​బాబు విగ్రహం తయారీ తమకు అప్పగించడంపై తయారీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దువ్వలో కర్నల్ సంతోష్​బాబు విగ్రహం

దేశంకోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్​బాబు విగ్రహం తయారు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో తయారు చేసిన రాజకీయనాయకుల విగ్రహాలకు ఎంతో పేరు వచ్చింది. సంతోష్​బాబు విగ్రహం మాకు మరింత గుర్తింపు తీసుకొస్తుందని అనుకుంటున్నాము - చంద్రశేఖర్

ఇదీ చదవండి: టిక్​టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... తరువాత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.