ETV Bharat / state

High Court: 'పునరావాసం లేకుండా ఖాళీ చేయించొద్దు'

author img

By

Published : Jul 25, 2021, 3:22 AM IST

High Court
హైకోర్టు

పోవలరం ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ప్రాజెక్ట్ పరిధిలోని తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ గ్రామాల గిరిజన నిర్వాసితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ ' శక్తి ' స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.శివరామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. వాదనలు విన్న ధర్మాసనం అధికారులకు, అథార్టీకి తగిన ఆదేశాలు జారీ చేసింది.

పోవలరం ప్రాజెక్ట్ పరిధిలోని వివిధ గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. పునరావాస ప్యాకేజ్ అమలు , పర్యవేక్షణ , నిర్వాసితుల హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ అఫిడవిట్ వేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథార్టీని ఆదేశించింది . పునరావాసం కల్పించకుండా అక్కడి ప్రజలను ఖాళీ చేయించబోమని గత విచారణలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీని గుర్తుచేసింది . వ్యాజ్యంపై తదుపరి విచారణను ఆగస్టు 23 కు వాయిదా వేసింది .హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శనివారం ఈమేరకు ఆదేశాలిచ్చింది .

పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ గ్రామాల గిరిజన నిర్వాసితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ ' శక్తి ' స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.శివరామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు . పిటిషనర్ తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ .. అధికారులు కాపర్ డ్యామ్ వద్ద నీటిని నిల్వ ఉంచి... గ్రామాలు నీట మునిగేలా చేస్తున్నారన్నారు . ఫలితంగా అక్కడి ప్రజలు ఖాళీ చేసి వెళ్లాళ్సిన పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు . పూర్తి స్థాయిలో పునరావాసం ఏర్పాట్లు చేయకుండా గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లోని భూయజమానులకు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద ఇచ్చే పరిహారాన్ని సక్రమంగా మదింపు చేయలేదన్నారు . పునరావాసం కల్పించే వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్ట్ అథార్టీ సరైన చర్యలు చేపట్టడం లేదని కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం అధికారులకు, అథార్టీకి తగిన ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

జలదిగ్బంధంలో పోలవరం ముంపు గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.