కష్టపడే వారికి గుర్తింపు లేదా.. వైకాపా సమన్వయ సమావేశంలో కార్యకర్తలు

author img

By

Published : May 12, 2022, 9:30 AM IST

Updated : May 12, 2022, 10:23 AM IST

MLA Granthi Srinivas

MLA Grandhi Srinivas: భీమవరంలో గడప గడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా పార్టీ సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహా పార్టీ కోసం కష్టపడే నాయకులకు గుర్తింపు లేదంటూ కార్యకర్తలు వాపోయారు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు ప్రయత్నించినా సీఎం అపాయింట్​మెంట్ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు.

MLA Grandhi Srinivas: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గడప గడపకు వైకాపా కార్యక్రమంలో భాగంగా జరిగిన సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​కు, పార్టీ కోసం కష్టపడే నాయకులకు అధిష్టానం వద్ద గుర్తింపు లేదని కార్యకర్తలు వాపోయారు. సీఎం అపాయింట్​మెంట్​ కోసం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇవ్వకపోవటంపై కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

గడప గడపకు కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్... జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్​పై గెలిచినా.. మంత్రి పదవి రాకపోవడంతో నాయకులు కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఒక సమయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీద కూడా విరుచుకుపడ్డారు. న్యాయం జరిగే వరకు వదిలేది లేదని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరికి సమావేశం అసంతృప్తి, అసంపూర్తిగా ముగిసింది. అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసానికి ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కౌర్ శ్రీనివాసులు వెళ్లి మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం చేస్తామని మిథున్​రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated :May 12, 2022, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.