ETV Bharat / state

గిరిజనులకు అటవీ భూములపై సాగు హక్కు పట్టాలు

author img

By

Published : Oct 3, 2020, 3:23 PM IST

గిరిజనుల ఎన్నోఏళ్ళుగా ఎదురుచూసిన తమ సాగు భూములకు హక్కు సాకారమైంది. మహాత్మగాంధీ జయంతిని పురుస్కరించుకుని ...రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగు హక్కు పట్టాల కార్యక్రమం ద్వారా గిరిపుత్రులు భూ యజమానులయ్యారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నా హక్కుకు ఠికానా లేక.., కష్టపడినా ఫలితం దక్కుతుందో తెలియక.. దినదిన గండంగా గడుపుతున్న వారికి అటవీ భూములు హక్కు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన సాగు హక్కు పట్టాలతో దశాబ్దల కల నెరవేరిందని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

rights-to-forest-lands-for-tribals-in-ap
గిరిజనులకు అటవీ భూములపై సాగు హక్కు పట్టాలు

ఎన్నో ఏళ్లుగా అడవితల్లి నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్న గిరిపుత్రులకు వారు సాగు చేసే అటవీ భూములకు సాగు హక్కు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి చట్టబద్ధత కల్పించింది. ఇందులో భాగంగా... రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని 1.50వేల గిరిజన కుటుంబాలకు 3లక్షల ఎకరాలు అందచేస్తూ., గాంధీ జయంతి పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టాలు అందచేశారు. ఇందులో భాగంగా విజయనగరంజిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు మూ డు షెడ్యూల్డు ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలని 8 మండలాల్లోని గిరిజనులకు అటవీ భూమి హక్కు పట్టాలు మంజూరు చేశారు. అదేవిధంగా నాన్ షెడ్యూల్డు ప్రాంతంలోని బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అటవీ భూములపై స్థానికంగా నివసించే గిరిజనులకు సాగు హక్కు కల్పించే పట్టాలు, ప్రభుత్వ భూముల సాగు చేసుకుంటున్న వారికి డీకేటీ పట్టాలు ఇవ్వనున్నారు.

అంతా సిద్ధం

జిల్లాలోని షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ప్రాంతాల్లో కలుపు కొని 13,076 గిరిజన కుటుంబాలకు 25,002 ఎకరాల అటవీ భూమిపై అటవీ హక్కుల పత్రాలు అందజేసేందుకు అంతా సిద్ధం చేశారు. మరో 9,945 మంది గిరిజనులకు 15,012ఎకరాల విస్తీర్ణంలో హక్కులు కల్పిస్తూ డీకేటీ పట్టాలను కూడా అందజేయనున్నారు. మొత్తం జిల్లాలోని గిరిజన కుటుంబాలకు 40,015 ఎకరాల భూములపై సాగు హక్కులు దక్కనున్నాయి. అటవీ భూములపై సాగు హక్కుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించగా., పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో కలెక్టర్ హరి జవహర్ లాల్, ఐటీడీఏ పీవో కూర్మనాధ్, శాసనసభ్యులు రాజన్నదొర, అలజంగి జోగారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏళ్ల త‌ర‌బడి భూముల‌ను సాగు చేసుకుంటున్నప్పటికీ, వాటిపై ఎటువంటి హ‌క్కు లేని గిరిజ‌నుల‌కు ఇప్పుడు ఆ భూముల‌కు య‌జ‌మానుల‌ు కావటంతో., వారిలో సంతోషం వెళ్లివిరుస్తోంద‌ని అన్నారు.

లబ్ధిదారుల హర్షం

రాష్ట్ర ప్రభుత్వం అటవీ సాగు భూములకు హక్కులు కల్పించటంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లత‌ర‌బడి తాము కంటున్న క‌ల ఇన్నాళ్లకు నెర‌వేరింద‌ని సంతోషం వ్యక్తం చేశారు. త‌ర‌త‌రాలుగా అటవీ భూములు సాగుచేసుకుంటున్నా., త‌మ‌కు భరోసా లేదు. పోడు పద్ధతిలో సాగు చేస్తున్న భూములపై ఎవరో వస్తారో., ఎప్పుడు అక్రమిస్తారో అనే భయంతో బతికేవాళ్లం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ సాగు భూములకు హక్కులు కల్పించటం ద్వారా ఎంతో మేలు జరగనుందని., ప్రభుత్వం అందించే పలు వ్యవసాయ పథకాలకు కూడా తాము అర్హత సాధించనట్లు అవుతుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా అడ‌విత‌ల్లిని న‌మ్ముకొని జీవ‌నాన్ని సాగిస్తున్న గిరిపుత్రుల‌కు వారు సాగుచేసే అట‌వీ భూమిపై సాగుహ‌క్కు క‌ల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప‌ట్టాల‌ను జారీ చేయటంపై గిరిజన సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అటవీ భూములకే కాకుండా., గిరిజనలు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు కూడా డీకేటీ పట్టాలు ఇవ్వటం అభినందనీయమంటున్నారు.

ఇదీ చదవండి:

తిరుపతిలో సీటీ స్కాన్​ పేరుతో స్కామ్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.